IND vs SA: హార్దిక్‌ పాండ్యా నుంచి టీమిండియా ఆశించిన దాన్ని.. శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడు: ఆకాశ్‌ చోప్రా

టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. గతకొంతకాలంగా శార్దూల్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడన్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 04:44 PM IST
  • టీమిండియా ఆశించిన దాన్ని శార్దూల్‌ నెరవేరుస్తున్నాడు
  • హార్దిక్‌ పాండ్యా లేకున్నా పర్వాలేదు
  • రెండో టెస్టులో శార్దూల్‌ చేసిన ప్రదర్శన అద్భుతం
IND vs SA: హార్దిక్‌ పాండ్యా నుంచి టీమిండియా ఆశించిన దాన్ని.. శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడు: ఆకాశ్‌ చోప్రా

Aakash Chopra lauded Shardul Thakur for making up for Hardik Pandya's absence: టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (Shardul Thakur)పై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ప్రశంసల వర్షం కురిపించారు. గతకొంతకాలంగా శార్దూల్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తున్నాడన్నాడు. కీలక వికెట్లు పడగొడుతూ జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషిసున్నాడని ఆకాశ్‌ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ 7 వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో కెరీర్‌లోనే అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 

ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) నుంచి టీమిండియా ఆశించిన దాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడన్నాడు. 'బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌ను పోల్చడం సరికాదు. బ్యాటింగ్‌ పరంగా చూస్తే హార్దిక్ చాలా ముందున్నాడు. అతడు భారీ పరుగులు చేయగలడు. అయితే బౌలింగ్‌లో హార్దిక్‌ కన్నా శార్దూల్‌ ముందుంటాడు. మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొడుతున్నాడు. హార్దిక్‌ నుంచి టీమిండియా ఆశించిన దాన్ని శార్దూల్‌ నెరవేరుస్తున్నాడు' అని ఆకాశ్‌ అన్నాడు. 

Also Read: Virat Kohli - Cheteshwar Pujara: విరాట్ కోహ్లీ త్వరలోనే ఫిట్‌నెస్‌ సాధిస్తాడు.. మూడో టెస్ట్ ఆడుతాడు: పుజారా

'శార్దూల్‌ ఠాకూర్ రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అద్భుతం. 7 వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్‌లో 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఠాకూర్ (Lord Shardul) వేగంగా పరుగులు చేశాడు. ఆ 28 పరుగులు ఎంత విలువైనవో బుధవారం తెలియకపోవచ్చు. గురువారం ఆ రన్స్ విలువ తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులే కావాలి. ఒకవేళ శార్దూల్‌ 28 పరుగులు చేయకపోయుంటే.. నాలుగోరోజు దక్షిణాఫ్రికా (South Africa) లక్ష్యం మరింత తక్కువగా ఉండేది. హనుమ విహారితో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పకపోయి ఉంటే భారత్ (India) ఇప్పటికే రేసు నుంచి తప్పుకునేది' అని ఆకాష్ చోప్రా తెలిపాడు. 

Also Read: Disha Patani In Pink Bikini: హద్దులు దాటిన దిశా పటాని ఎద అందాలు.. పింక్ బికినీలో పిచ్చెక్కిస్తోంది!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News