తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో మావోయిస్ట్ అగ్రనేత హరిభూషన్‌తోపాటు ఆరుగురు మహిళా మావోయిస్టులు వున్నట్టు తెలుస్తోంది. చత్తీస్‌గడ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతంలోఉడతమల్ల వద్ద పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కమాండో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై స్పష్టమైన సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు ఉడతమల్ల మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం అందుతోంది.
BIG NEWS: Telangana State Committee of CPI (Maoist) receives a big jolt with Haribhushan getting killed. More details to follow. #Maoists https://t.co/MKl5mUgjpa
— Srinivas Reddy K (@KSriniReddy) March 2, 2018
ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు లభ్యమైనట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.