IND Vs NZ: ఆ యువ ఆటగాడు ఉన్నాడు.. రాహుల్‌ లేని ప్రభావం జట్టుపై ఉండదు: రహానే

న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దూరం అవ్వటంతో ఆ ప్లేస్ లో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) టెస్టు క్రికెట్‌ అరంగేట్రం చేయనున్నాడు.. మరిన్ని విశేషాలు మీకోసం..!!

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 07:28 PM IST
  • టెస్టు క్రికెట్‌ అరంగేట్రం చేయనున్న శ్రేయస్‌ అయ్యర్‌
  • గాయం కారణంగా మొదటి టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ దూరం
  • టెస్టు సీరీస్ పైన కూడా కన్నేసిన టీమిండియా..
IND Vs NZ: ఆ యువ ఆటగాడు ఉన్నాడు.. రాహుల్‌ లేని ప్రభావం జట్టుపై ఉండదు: రహానే

Ajinkya Rahane says Shreyas Iyer to Make His Test Debut in Kanpur: న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టులో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) లేని ప్రభావం భారత జట్టుపై ఏ మాత్రం ఉండదని తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే (Rahane) అన్నాడు. యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) టెస్టు క్రికెట్‌ అరంగేట్రం చేయనున్నాడని స్పష్టం చేశాడు.

బ్యాటింగ్‌ విభాగంలో సమతూకం కోసం అయ్యర్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు రహానే తెలిపాడు. రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా గురువారం (November25) నుంచి కాన్పూర్‌లోని (Kanpur) గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు (India vs New Zealand 1st Test) ఆరంభం కానుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. టెస్ట్ సిరీస్‌పై కూడా కన్నేసింది. 

Also Read: Tomato Price Increased: 20 రోజుల్లో లక్షాధికారిని చేసిన టమోటా.. ఇప్పటి వరకు రూ. 80 లక్షలపైనే...

తుది జట్టులోకి శ్రేయస్‌..
న్యూజిలాండ్‌తో (New Zealand) జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తొడ గాయం కారణంగా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (KL Rahul)టెస్ట్ సిరీస్‌కు దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) మంగళవారం వెల్లడిండింది.

ఇక రాహుల్ స్థానంలో ఐపీఎల్ స్టార్ సూర్యకుమార్‌ యాదవ్‌ని (Surya Kumar Yadhav) జట్టులోకి తీసుకుంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అజింక్య రహానే (Ajinkya Rahane) మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'కాన్పూర్‌ టెస్టుతో శ్రేయాస్ అయ్యర్ సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. దురదృష్టవశాత్తు రాహుల్ గాయపడ్డాడు. అతను తదుపరి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడు' అని రహానే తెలిపాడు. 

యువ క్రికెటర్లు ఉన్నారు..
లోకేష్ రాహుల్ (Lokesh Rahul) లేని లోటు ఎలా ఉంటుందనే దానిపై అజింక్య రహానే స్పందించాడు. 'కేఎల్‌ రాహుల్‌ లేకపోవడం భారత జట్టుకు దెబ్బే. ఎందుకంటే.. ఇంగ్లండ్‌ సిరీస్‌లో (England Series) రాహుల్‌ అద్భుతంగా రాణించాడు. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఈ సిరీస్‌కు అతడు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. టీమిండియాకు (Team India) మంచి యువ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వారిలో ఒకరు ఓపెనింగ్‌ స్థానాన్ని భర్తీ చేస్తారు' అని రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal), శుభ్‌మన్ గిల్ (Shubhaman Gill) ఓపెనింగ్ చేయనున్నారు.

Also Read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!

ఇక నాలుగో స్థానంలో అయ్యర్ రానున్నాడు. అయితే టీ20 సిరీస్ (Paytm T20 Series), తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. అప్పుడు అయ్యర్ తుది జట్టులో ఉంటాడో లేదో చూడాలి. 

ద్రవిడ్‌ ఒక్కటే చెప్పాడు..
రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా రావడంపై కూడా అజింక్య రహానే మాట్లాడుతూ... 'రాహుల్‌ ద్రవిడ్‌ మాకు ఒక్కటే చెప్పాడు. ఎక్కువగా ఆలోచించకుండా మా శైలిలో ఆడాలని సూచించాడు. చేతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara), నాకు గేమ్‌ ప్లాన్‌ ఏంటో తెలుసు. దానిని మైదానంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్‌ లేకపోవడం యువ క్రికెటర్లకు మంచి అవకాశం.

దీనిని సద్వినియోగం చేసుకోవడానికి బాగా ఆడాలి. స్వేచ్ఛగా ఆడితే వాటంతటవే పరుగులు వస్తాయి. భారత్ (India), దక్షిణాఫ్రికాలో (South Africa) పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ముందుగా కివీస్‌తో (Kiwis) టెస్టు సిరీస్‌పైనే దృష్టిసారించాం' అని చెప్పుకొచ్చాడు.

Also Read: Hindi Jersey Trailer: 'ఆటిట్యూడ్ కా బాప్'..హిందీ జెర్సీ ట్రైలర్.. షాహిద్.. నానిని బీట్ చేశాడా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News