A Family suicide in karnataka: కర్ణాటక(Karnatak)లోని కోలారు పట్టణం(Kolar)లో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర పోలీసు అధికారులు మంగళవారం ధ్రువీకరించారు.
మృతులను మునియప్ప (75), నారాయణమ్మ (70), బాబు (45), గంగోత్రి (17), పుష్ప (33)గా గుర్తించారు. విషం తాగిన వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నలుగురు ఆసుపత్రిలో మృతి చెందారు. పుష్పను మరో ఆసుపత్రి(Hospital)కి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమె కూడా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. స్థానిక గల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read: Suicide: కుమారుడి మరణ వార్త విని....ప్రాణాలు తీసుకున్న తల్లి, అమ్మమ్మ
వివరాల్లోకి వెళితే..
మునియప్ప కుమార్తె పుష్పకు మరో కుటుంబానికి చెందిన యువతి 20 రోజుల కిందట ఓ చిన్నారిని ఇచ్చి తాను అత్యవసరంగా వేరే గ్రామానికి వెళ్లాల్సి ఉన్నందున కాస్తా చూసుకోవాలని కోరింది. అందుకు పుష్ప అంగీకరించి పాపను స్వీకరించింది. పొరుగూరి నుంచి వచ్చిన తరువాత తన పాపను ఇవ్వాల్సిందిగా ఆ యువతి కోరగా.. తనకు ఎవ్వరినీ ఇవ్వలేదంటూ పుష్ప బుకాయించిందట. దీంతో బాధిత యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన స్థానిక గల్‌పేట పోలీసులు మునియప్ప, ఆయన కుటుంబ సభ్యులను ఈ విషయమై వాకబు చేశారు. తమ పరువు పోయిందనే బాధతో ఐదుగురు విషం తాగారు. పరిస్థితి విషమించడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి తొలుత నలుగురు మృతి చెందారు. అనంతరం మునియప్ప కుమార్తె పుష్ప కూడా మరణించినట్లు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook