Corona Cases in India: దేశంలో మరోసారి కరోనా కేసులు(Covid-19 Cases) తగ్గాయి. నిన్న 10,85,848 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,126 మందికి వైరస్ పాజిటివ్(Corona positive cases)గా తేలింది. కొత్త కేసులు ఫిబ్రవరి ప్రారంభం నాటి స్థాయికి తగ్గగా..రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడింది. అలాగే కేరళ, తమిళనాడు, మిజోరం, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్.. కేసుల పరంగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో ఇప్పటివరకు 3.43 కోట్ల మందికి కరోనా(Coronavirus) బారిన పడ్డారు. వారిలో 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. నిన్న ఒక్కరోజే 11,982 మంది వైరస్ ను జయించారు. ప్రస్తుతం కొవిడ్(Covid-19)తో బాధపడుతున్నవారి సంఖ్య 1.40 లక్షలకు తగ్గింది. ఈ సంఖ్య 263 రోజుల కనిష్ఠానికి చేరింది. దాంతో క్రియాశీల రేటు 0.41 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు(Recovery rate) 98.25 శాతానికి పెరిగింది.
Also Read: Srinagar: శ్రీనగర్‌కు యునెస్కో గుర్తింపు..ప్రధాని మోదీ అభినందనలు
జోరుగా టీకా పంపిణీ
కేరళ గణాంకాలను సవరిస్తుండటంతో మరణాల సంఖ్య(Covid Deaths) భారీగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 332 మరణాలు నమోదుకాగా.. అందులో 262 కేరళ(Kerala)వే. ఇప్పటివరకు 4,61,389 మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న 59 లక్షల మందికిపైగా టీకా(Covid Vaccination) వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 109 కోట్ల మార్కును దాటింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook