Viral Video:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

రన్నింగ్ రైలు ఎక్కటం లేదా దిగటం ఎంత ప్రమాదకరమో తెలిసిందే.. ఒక 8 నెలల గర్భిణీ రైలు దిగబోతూ కింద పడబోయింది.. అక్కడే ఉన్న రైల్వే పోలీసు ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడిన వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2021, 11:08 AM IST
  • రన్నింగ్ రైలు నుండి కిందకి దిగబోయిన గర్భిణీ
  • ప్రాణాలకు తెగించి కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
  • రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
Viral Video:రన్నింగ్ రైలు నుండి దిగబోతూ కిందపడబోయిన గర్భిణీ.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

RPF Saves a Pregnant While Deboarding Train: రైలు ఎక్కేప్పుడు.. దిగేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు తెలిసిందే.. ముఖ్యంగా కదిలే రైలు ఎక్కేప్పుడు, దిగేప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్ లో ఇప్పటి వరకు చాలా వరకు కదులుతున్న రైలు ఎక్కబోతూ లేదా దిగబోతూ కలిగిన ప్రమాదాలకు గురైన వీడియోలు చాలానే చూసాం.. కానీ అలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

వివరాల్లోకి వెళ్తే..  ఈ ఘటన మహారాష్ట్రలోని (Maharastra) కల్యాణ్ రైల్వేస్టేషనులో (Kalyan railway station) జరిగింది. వందన అనే 21 ఏళ్ల గర్భిణీ తన భర్త, పాపతో కలిసి కల్యాణ్ రైల్వేస్టేషను నుంచి గోరఖ్ పూర్ (Gorakhpur) వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. అనుకోకుండా వారు వేరే రైలు ఎక్కటం... అది తెలిసి దిగే సమయానికి రైలు కదలటం ప్రారంభించింది. అంతే ఏం చేయాలో తెలియక దిగటానికి ప్రయత్నించారు. 

Also Read: India vs England warm-up match: వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఇండియా ఘన విజయం.. మెరిసిన Ishan Kishan, KL Rahul

వందన 8 నెలల గర్భవతి అయినందున కదులుతున్న రైలు నుండి దిగే ప్రక్రియలో ప్లాట్ ఫాం మీద పడబోయింది. అక్కడే విధుల్లో ప్లాట్ ఫాంపై ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (Railway Protection Force) కానిస్టేబుల్ ఎస్ఆర్ ఖండేకర్ (SR Khandekar) తీవ్రగా ఆమెను పట్టుకొని లాగేసరికి ప్రాణాలతో బయట పడింది. 

ఒకవేళ అక్కడ ఎస్ఆర్ ఖండేకర్ లేకపోతే ఆ గర్భిణీ మహిళ రైలు, ప్లాట్ ఫారమ్ మధ్య ఖాళీలో పడి ఉండేదని తెలుస్తుంది. ప్రమాదం నుండి బయటపడ్డ ఆమె కుటుంబ సభ్యులతో సరైన రైలు ఎక్కి వెళ్ళిపోయింది. ఇదంతా అక్కడ రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ముంబైలోని (mumbai) సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (central railway chief public relation officer) శివాజీ సుతార్ (Shivaji Sutar) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. 

Also Read: Anasuya Fires on Kota: హీరోలు ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఎందుకు అడగరు..? కోటకు స్ట్రాంగ్ కౌంటర్

వీడియో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికి వైరల్ అవ్వగా.. రైలు కదిలేపుడు ఎవరు ఇలాంటివి చేయొద్దని  శివాజీ సుతార్ తెలిపారు. మహిళను కాపాడిన ఎస్ఆర్ ఖండేకర్ రియల్ హీరో అంటూ ప్రశంసలతో నెటిజన్లు ముంచెత్తుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News