ZEEL-Invesco case: ZEEL merger ప్రతిపాదనపై స్పందించిన Reliance.. కీలకమైన అంశాలు వెల్లడి

Reliance statement about ZEEL-Invesco case: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ సంస్థకు పునీత్ గోయెంకాను ఎండీ, సీఈఓగా (ZEEL MD & CEO Mr. Punit Goenka) కొనసాగుతారని జీల్ చెప్పిన విషయాన్నే రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటనలోనూ ప్రస్తావించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 11:13 PM IST
  • ZEEL సంస్థతో విలీనం ప్రతిపాదనపై స్పందించిన RIL.
  • జీ, Invesco సంస్థల మధ్య నెలకొన్న వివాదం గురించి ప్రస్తావించిన రిలయన్స్.
  • విలీనం సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునీత్ గోయెంకా కొనసాగింపు గురించి ప్రస్తావన
ZEEL-Invesco case: ZEEL merger ప్రతిపాదనపై స్పందించిన Reliance.. కీలకమైన అంశాలు వెల్లడి

Reliance statement about ZEEL-Invesco case: జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌తో తమ కంపెనీకి చెందిన మీడియా సంస్థలను విలీనం చేసే ప్రతిపాదనకు సిద్ధపడింది వాస్తవమే అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంగీకరించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. విలీనం ప్రతిపాదనకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను ఆ ప్రకటనలో పేర్కొంది. జీల్ సంస్థతో విలీనం ప్రతిపాదన చేసిన మాట వాస్తవమే కానీ జీల్ సంస్థ వ్యవస్థాపకుల వాటాల (stake of Zee founders) విషయంలోనే తేడాలు రావడంతో ఆ ప్రతిపాదనను తిరిగి వెనక్కి తీసుకున్నట్టు రిలయన్స్ తెలిపింది. జీల్ సంస్థను పునరుత్తేజితం చేసేందుకు సహాయపడే సంస్థగా ఇన్వెస్కో రిలయన్స్‌ని పేర్కొన్న కొన్ని గంటల తర్వాతే ముఖేష్ అంబానీ కంపెనీ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

"జీ, ఇన్వెస్కో సంస్థల మధ్య నెలకొన్న వివాదంలో తమ సంస్థ పేరు రావడంపై చింతిస్తున్నాం అని ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్... ఈ విషయంపై మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది. 

Mr Punit Goenka as MD and CEO - విలీనం సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా పునీత్ గోయెంకా కొనసాగింపు:
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ కంపెనీలో పెట్టుబడులు పెట్టినా.. ఆ కంపెనీ మేనెజ్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇచ్చి వారిని అలాగే కొనసాగించి ప్రోత్సహిస్తుందని.. అలాగే జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ కంపెనీ విషయంలోనూ జీల్ సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా ఉన్న పునీత్ గోయెంకాను విలీనం సంస్థలోనూ ఎండీ, అండ్ సీఈఓగా కొనసాగించే విధంగా ప్రతిపాదన చేసినట్టు రిలయన్స్ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.

Also read : ZEEL-Invesco case: జీ ఎంటర్‌టైన్మెంట్ డీల్ విషయంలో Invesco మోసాన్ని బట్టబయలు చేసిన Punit Goenka

జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ సంస్థకు పునీత్ గోయెంకాను ఎండీ, సీఈఓగా (ZEEL MD & CEO Mr. Punit Goenka) కొనసాగుతారని జీల్ చెప్పిన విషయాన్నే రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటనలోనూ ప్రస్తావించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

ఇదిలావుంటే, ఈ మొత్తం వ్యవహారం గురించి తెలిసిన వాళ్లు చెబుతోంది ఏంటంటే... ''జీల్ సంస్థకి కొత్త డైరెక్టర్స్‌గా ఇన్వెస్కో (Invesco proposal for ZEEL board) ప్రతిపాదించిన ఆరుగురు వ్యక్తులు కూడా ఏదో ఒక రకంగా రిలయన్స్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న వారే. దీంతో ఈ విషయంలో స్టాక్స్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతోపాటు (SEBI) ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది'' అని గుర్తుచేస్తున్నారు.

Invesco role in assisting Reliance - చర్చల కోసం రిలయన్స్‌కి సహాయపడిన ఇన్వెస్కో:
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేసిన మీడియా ప్రకటనలో ప్రస్తావించిన వివరాల ప్రకారం, " ఈ ఏడాది ఫిబ్రవరి/ మార్చిలో రిలయన్స్‌ ప్రతినిధులకు, జీ సంస్థను స్థాపించిన కుటుంబానికి చెందిన, జీ మేనేజింగ్ డైరెక్టర్ పునిత్ గోయెంకా మధ్య నేరుగా చర్చలు జరగడానికి ఇన్వెస్కో సంస్థ రిలయన్స్‌కి సహాయపడింది. ఈ సందర్భంగా జీ విలీనం కోసం రిలయన్స్ (RIL) ప్రతిపాదన చేసింది. జీ సంస్థతో పాటు మా మీడియా కంపెనీలకు ఫెయిర్ వ్యాల్యుయేషన్ చేయడం జరిగిందని రిలయన్స్ ప్రకటన వెల్లడించింది. విలీన సంస్థకు లాభం చేకూర్చడంతో పాటు జీ సంస్థలో వాటాదారుల (shareholders of Zee) ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా ప్రతిపాదన చేయడం జరిగిందని రిలయన్స్ గుర్తుచేసింది.

Also read : ZEEL, Sony merger deal value: జీ ఎంటర్‌టైన్మెంట్, సోనీ పిక్చర్స్ విలీనం.. ఎవరి బలాలు ఎంత ?

ఆ విషయంలోనే వెనక్కి తగ్గినట్టు RIL వెల్లడి: అయితే జీ వ్యవస్థాపకుల వాటాల విషయంలోనే జీ సంస్థకు ఇన్వెస్కోకు మధ్య విభేదాలు (ZEEL-invesco case) తలెత్తాయని, దీంతో పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదనే సదుద్దేశంతోనే తాము ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించింది.

Also read: ZEEL-Sony MEGA Merger: జీల్, సోనీ విలీన సంస్థలో వాటాల వివరాలు, వ్యూహ్యాత్మక అంశాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x