Islamabad: పాక్‌ అణుశాస్త్ర పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూత

Abdul Qadeer Khan: పాకిస్థాన్‌ను అణ్వాయుధ  దేశంగా  తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని ఇమ్రాన్ సంతాపం ప్రకటించారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 07:51 PM IST
Islamabad: పాక్‌ అణుశాస్త్ర పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ కన్నుమూత

Islamabad: పాక్‌ అణుశాస్త్ర పితామహుడిగా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్(Abdul Qadeer Khan) ఆదివారం కన్నుమూశారు. 85 ఏళ్ల ఖదీర్ ఖాన్ అనారోగ్యం కారణంగా ఇస్లామాబాద్‌(Islamabad)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ఖాన్‌ వెల్లడించారు. ఆయనకు కొవిడ్‌(Coivd) లక్షణాలు కూడా ఉన్నట్లు తెలిపారు. 

ముస్లిం దేశాల్లో మొదటి అణ్వాయుధ  దేశంగా పాకిస్థాన్‌(Pakistan)ను తీర్చిదిద్దడంలో ఖాన్‌ కీలకపాత్ర పోషించారు. ఖదీర్ ఖాన్ మృతికి సంతాపం తెలిపిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) ట్విటర్‌ వేదికగా ఆయన సేవల్ని కొనియాడారు. పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్‌-ఇ-పాకిస్థాన్‌ అవార్డు అందుకున్నారు. 

Also read: Taiwan: తైవాన్ విలీనం ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్న చైనా

రాత్రికి రాత్రే హీరోగా గుర్తింపు..
ఖదీర్ ఖాన్ భారత్‌లోని భోపాల్ నగరంలో జన్మించారు. దేశ విభజన తర్వాత ఖాన్ తన కుటుంబంతో పాకిస్థాన్ తరలివెళ్లారు. కరాచీలోని డీజే సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేసిన ఖదీర్ ఖాన్.. జర్మనీ, హాలండ్‌లోని విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్నారు. 1998లో పాకిస్థాన్ మొదటి అణు పరీక్ష నిర్వహించగా.. డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ రాత్రికిరాత్రే ఆ దేశవ్యాప్తంగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

న్యూక్లియర్‌ రహస్యాల(Nuclear‌ Secrets)ను ఇతర దేశాలకు వెల్లడిస్తున్నాడన్న ఇతనిపై అభియోగాలు వచ్చాయి. 2004లో అప్పటి అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ ప్రభుత్వం ఖాన్‌ను గృహనిర్బంధంలో ఉంచింది. కొంతకాలం అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో విడుదలయ్యారు. అయితే యూరప్‌లో ఉన్న సమయంలో అణ్వాయుధాలకు సంబంధించిన కీలకపత్రాలను దొంగిలించాడన్న ఆరోపణలు ఖాన్‌పై వెల్లువెత్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News