Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఇటీవల కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి పెదన్నగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నాయి.
టాలీవుడ్(Tollywood)లోని సమస్యల పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి గత కొద్దికాలంగా యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. 2020లో కరోనా సంక్షోభ సమయంలో మూతపడిన ధియేటర్లు తిరిగి తెర్చుకున్న తరువాత విద్యుత్ బిల్లుల మాఫీ విషయంలో ప్రభుత్వంతో చర్చించి సాధించిపెట్టారు.ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో నెలకొన్న టికెట్ల ధరల విషయంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)..ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశం కానున్నారు. వాస్తవానికి ఆగస్టు రెండవ వారంలోనే భేటీ జరగాల్సి ఉన్నా..వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి సెప్టెంబర్ 4 వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌తో అప్పాయింట్‌మెంట్ ఖరారైంది. ఈ భేటీలో సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడనున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్లతో టిక్కెట్ల ధరల గురించి చర్చ జరగనుంది. సమావేశం ప్రధాన అజెండా ఇదే. మరోవైపు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం (Ap government)నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలను పరిశ్రమ పెద్దలు కోరుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపై చిరంజీవి..ముఖ్యమంత్రి జగన్‌తో(Ap cm ys jagan) చర్చించనున్నారు.
Also read: New Movie Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న కొత్త సినిమాల జాబితా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook