Penalty for Actress: ట్యాక్స్ ఎగ్గొట్టిందని..టీవీ నటికి రూ.330కోట్ల ఫైన్! ఎక్కడో తెలుసా?

Penalty for Actress: పన్ను ఎగవేత ఆరోపణలపై చైనా నటి జెంగ్ షువాంగ్‌కు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(రూ.330కోట్లు) జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం. పన్ను చెల్లించే వరకు తన నటించిన షోలు, డ్రామాలు, సీరీస్​లు ఏవీ ప్రదర్శించకుండా నిషేధం విధించింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2021, 03:18 PM IST
  • చైనా నటికి భారీ జరిమానా
  • పన్ను ఎగవేసినందుకు రూ.330 కోట్ల ఫైన్
  • ఆమె ప్రోగ్రామ్ ల ప్రసారాలపై నిషేధం
Penalty for Actress: ట్యాక్స్ ఎగ్గొట్టిందని..టీవీ నటికి రూ.330కోట్ల ఫైన్! ఎక్కడో తెలుసా?

Penalty for Actress:  ఏ దేశంలోనైనా పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరూ ఆదాయపు పన్ను(Income tax) చెల్లించాల్సిందే. దీనికెవరూ అతీతులు కాదు. అందులోనూ ఆయా దేశాలకు ఖజానా నిండటానికి ఈ పన్ను(taxes)లే ఆధారం. మన దేశంలో పన్నులను జీఎస్టీ రూపంలో వసూలుచేస్తోంది ప్రభుత్వం. అలాగే చైనా(china) కూడా పన్నులు వసూలు చేస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి చైనా అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది. ఇదే కోవలో ఆ దేశానికి పన్నులు కూడా బాగానే వస్తున్నాయి. 

చైనా కొత్త పాలసీ
ఇటీవల దేశంలో పేద, ధనికుల మధ్య అంతరాలు తగ్గించాలనే యోచనలో నూతన ఆదాయపు పన్నులు విధించే పద్దతులు(system) ను చైనా తీసుకొచ్చింది. అందులో భాగంగా  సెలెబ్రెటీలపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. పన్ను కట్టని వారిపై నిషేధం విధిస్తోంది. తాజాగా ఓ టాప్​ సెలెబ్రెటీ(top celerity) పన్ను ఎగ్గొట్టిన్నందుకు 46 మిలియన్ యూఎస్ డాలర్లు(330 crores) కట్టాలని సమన్లు జారీ చేసింది. పన్ను చెల్లించే వరకు తను నటించిన షోలు, డ్రామాలు, సీరీస్​లు ఏవీ ప్రదర్శించకుండా నిషేధం(ban) విధించింది. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా..పదండి స్టోరీలోకి..

Also read: Hotstar uninstall చేయాల్సిందిగా ట్విటర్‌లో నిరసనలు

ట్యాక్స్ ఎగవేసినందుకు స్టార్ నటికి  చైనా(china) అధికారులు భారీ జరిమానా(fine) విధించారు. రూ. 330 కోట్లు కట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చైనాలో 30 ఏళ్ల జెంగ్‌‌‌‌ షువాంగ్‌‌‌‌(Zheng Shuang) ప్రముఖ టీవీ, సినిమా నటి. 2019, 2020ల్లో ఆమె నటించిన సినిమాలు, టీవీ సిరీస్‌‌‌‌ల కోసం తీసుకున్న పేమెంట్‌‌‌‌కు సంబంధించి సరిగా పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌(Shanghai Municipal Tax Service) గుర్తించింది. దీంతో శుక్రవారం పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఆమె  మాజీ భర్త జెంగ్ హెంగ్ సమాచారం మేరకు మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

చైనా చట్టాల(China Acts)ను పాటించని నటీనటుల షోలను ప్రసారం చేయరు. ఈ నేపథ్యంలో నటి జెంగ్‌‌‌‌ (Zheng Shuang) నటించిన ప్రోగ్రామ్‌‌‌‌లను ప్రసారం చేయబోమని నేషనల్‌‌‌‌ రేడియో, టెలివిజన్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ శుక్రవారం వెల్లడించింది. సరోగసీ ద్వారా జన్మనిచ్చిన ఇద్దరు శిశువులను అమెరికా(America)లో వదిలేసిందనే ఆరోపణలపై జెంగ్‌‌‌‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాగా, ఇటీవల ఇండియా(India)లో కూడా పన్ను ఎగ్గొట్టిన పలువురు సెలబ్రెటీలపై ఇన్​కంట్యాక్స్​ అధికారులు కేసులు పెట్టారు. హీరో విశాల్(Hero Vishal)​ సైతం ఇటీవల ఆదాయపు పన్ను కేసులో కోర్టు మెట్లు సైతం ఎక్కడం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook

Trending News