These couple has been living Without clothes: బట్టలు వేసుకోకుండా జీవనం సాగించే భార్య భర్తలు గురించి తెలుసుకోవాలని ఉందా..అయితే పదండి ఇంగ్లండ్(England) వెళ్దాం..మీరు వారి జీవన విధానాన్ని చూస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!
ఎందుకంటే వీరు విద్యుత్(Electricity) వాడరు, కుళాయి నీటిని తాగరు, అసలు బట్టలే వేసుకోరు. ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో ప్రకృతి మధ్య పాత వాహనంలో జీవితాన్ని గడిపేస్తున్నారు. వీరు నగరానికి వచ్చినా దుస్తులు ధరించరు. ఇంగ్లండ్(England) లోని చిప్పెన్హామ్ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికులు జాన్, హెలెన్ దంపతులు జీవన విధానం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Also Read: ఆనంద్ మహీంద్రకు టైమ్ మిషన్ కావాలంట..ఎందుకో తెలుసా
2011లో జాన్, హెలన్ పురాతన పద్ధతిలో వివాహం చేసుకున్నారు. 2006 నుంచి నేచరిస్ట్(Naturist)గా జీవనం సాగిస్తుంది హెలెన్. ఆమెను ఇష్టపడిన జాన్.. 2011 నుంచి తను కూడా అలా మారిపోయారు. ఇద్దరూ 24 గంటలూ బట్టలు లేకుండానే గడుపుతారు. కరెంట్ వాడరు. సహాజంగా ప్రకృతిలో లభించే నీటిని తప్ప.. కుళాయిల ద్వారా వచ్చే నీటిని వినియోగించరు. వీరిది పూర్తిగా ప్రకృతితో మమేకమైన జీవనం. నగరంలోకి వెళ్లాల్సి వచ్చినపుడు కూడా వీరు నగ్నంగానే వెళ్తారు.
`మాది ఓ ప్రత్యేకమైన జీవన విధానం. అందరూ అనుసరించదగినది కాదు. ఇలా జీవించమని మేము ఎవరినీ బలవంతం కూడా చేయము. మాకు ఇలా బతకాలని అనిపించింది. మేం న్యూడిస్ట్‌లం కాదు.. నేచురలిస్ట్‌లం. రెండు తువ్వాళ్లు తప్ప మా దగ్గరం ఇంకెలాంటి దుస్తులూ లేవు. విద్యుత్తును వాడం. మేం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నాం కాబట్టి.. జంతువులు(Animals), కీటకాల నుంచి ప్రమాదం లేకుండా ఉండడం కోసం వ్యాన్‌లో ఉంటున్నామ`ని హెలెన్ (helen) చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook