Karnataka: కర్ణాటక అధికార పీఠం మారనుంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన యడ్యూరప్ప..పీఠం నుంచి దిగుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్‌న్యూస్ అందించారు.
కర్ణాటకలో(Karnataka) మారిన రాజకీయాల నేపధ్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్పకు(Yediyurappa) పదవీగండం తప్పలేదు. అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటకలో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీ(BJP) శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని సేకరించనున్నారు. పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, జి కిషన్ రెడ్డి(Kishan reddy)లను అధిష్టానం నియమించింది. రెండ్రోజుల్లో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తి కానుంది. అప్పటి వరకూ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా గవర్నర్ వ్యవహరించనున్నారు.
మరోవైపు పదవికి రాజీనామా చేసి దిగిపోయేముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించి వెళ్లారు యడ్యూరప్ప(Yediyurappa).రాజీనామా చేయడానికి కొద్ది గంటల ముందు ఉద్యోగుల డీఏను(DA Hike) 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మూలవేతనంలో 21.50 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఇది మూలవేతనంలో 11.25 శాతంగా ఉంది. దాదాపుగా రెట్టింపైంది ఇప్పుడు. యడ్యూరప్ప తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 4.5 లక్షలమంది పెన్షనర్లతో పాటు పీఎస్‌యూ, కార్పొరేషన్లలో పనిచేసే 3 లక్షలమందికి ప్రయోజనం కలగనుంది.
Also read : Corona Vaccine for Children: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఆగస్టు నుంచే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook