Petrol Price In Hyderabad: ఇంధనధరలు వాహనదారులకు నిన్న స్వల్ప ఊరట కలిగించాయి. కానీ మరోసారి పెట్రో మంట మండింది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు సైతం సెంచరీలు కొడుతున్నాయి. ఇంధన ధరలు నిన్న నిలకడగా ఉండగా, నేడు పెట్రోల్ ధరలు పెరిగాయి.
నేడు పెట్రోల్ ధరలు 25 నుంచి 35 పైసల వరకు పుంజుకోగా, డీజిల్ ధరలు 15 నుంచి 17 పైసల వరకు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా, డీజిల్‌పై 16 పైసల చొప్పున తగ్గింది. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19రే చేరగా, డీజిల్ ధర రూ. 89.72కు దిగొచ్చింది. జులై నెలలో 8 పర్యాయాలు ఇంధన ధరలు పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, లడఖ్, పంజాబ్, తమిళనాడు, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు నాగాలాండ్, బిహార్, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోల్ ధర ఇటీవల సెంచరీ మార్కు దాటింది.
హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 29 పైసలు పెరగగా, డీజిల్‌పై 18 పైసల చొప్పున తగ్గింది. నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.105.15 చేరగా, డీజిల్ ధర రూ. 97.78కు దిగొచ్చింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. జులై 12న నిన్నటి ధరలతో పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.20 కాగా, డీజిల్ ధర రూ.97.29కి తగ్గింది. కోల్‌కతాలో పెట్రోల్ దర రూ.101.35, డీజిల్ ధర రూ.92.81 అయింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అత్యధికంగా పెట్రోల్ ధర రూ.109.53కి చేరింది. డీజిల్ ధర రూ.98.50కి స్వల్పంగా దిగొచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook