AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ..రికవరీ రేటు పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఇప్పటికీ రాష్ట్రంలో భారీగా జరుగుతున్నాయి.
ఏపీలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో(Corona Second Wave) పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. గత కొద్దికాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అటు కరోనా యాక్టివ్ కేసులు కూడా తగ్గాయి. గత 24 గంటల్లో ఏపీలో 94 వేల 595 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..3 వేల 175 మంది పాజిటివ్‌గా తేలారు. ఇక మరో 3 వేల 692 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 18 లక్షల 54 వేల 754 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షల 2 వేల 923కు చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 29 మంది మరణించగా..ఇప్పటి వరకూ 12 వేల 844 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 35 వేల కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 23 లక్షల 63 వేలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)నిర్వహించారు.
కాగా తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో ఇంకా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టలేదు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 కేసులు, చిత్తూరులో 473 కేసులు నమోదు కాగా..మూడవ స్థానంలో 398 కేసులతో పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 59 కేసులు నమోదు కావడం విశేషం.
Also read: Amaravati Lands Scam: చంద్రబాబు అండ్ కో భూముల్ని లాక్కున్నారు, సాక్ష్యాలివే : ఎమ్మెల్యే ఆర్కే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook