Corona Second Wave: కరోనా మహమ్మారి సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. దేశంలో అన్‌లాక్ ప్రక్రియ కొససాగుతున్నా..కరోనా ముప్పు మాత్రం తొలగలేదు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్రమే తాజాగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి తగ్గడంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Plus Variant) రూపంలో కరోనా థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు ఇప్పటికే వచ్చాయి. ఈ నేపధ్యంలో కేంద్రం చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని కేంద్రం హెచ్చరించింది. కరోనా ముప్పు తొలగిపోలేదని..ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. కేరళ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, ఛత్తీస్‌గడ్, మణిపూర్‌లలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది.ఈ ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని కేంద్రం (Central government) వివరించింది.
గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 46 వేల 617 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 4 లక్ల 58 వేల 251కు చేరుకుంది. కోవిడ్ కారణంగా గత 24 గంటల్లో 853 మంది ప్రాణాలు కోల్పోగా..ఇప్పటి వరకూ 4 లక్షలమంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 5 లక్షల 9 వేల 637 యాక్టివ్ కేసులున్నాయి.
Also read: Johnson and Johnson: డేల్టా వేరియంట్‌కు సమాధానం జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సినే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook