Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్‌పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్ విధానంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వలస కార్మికుల కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలకు డెడ్‌లైన్ విధించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2021, 05:38 PM IST
Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్‌పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court: వన్ నేషన్..వన్ రేషన్ విధానంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వలస కార్మికుల కోసం ఈ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రాలకు డెడ్‌లైన్ విధించింది.

వన్ నేషన్..వన్ రేషన్ విధానం(One nation-One ration policy)పై ఇటీవల చర్చ నడుస్తోంది. సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. వన్ నేషన్..వన్ రేషన్ విధానంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జూలై నాటికి అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల కోసం వన్ నేషన్..వన్ రేషన్ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేస్తూ జూలై 31 గడువు విధించింది. జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. అసంఘటిత, వలస కార్మికుల(Migrant labour)వివరాల్ని నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 31లోగా పోర్టల్ అభివృద్ధి చేసి అందుబాటులో తీసుకురావాలని ఆదేశించింది. జూలై 31 లోగా ప్రక్రియ ప్రారంభించాలని తెలిపింది.అటు రాష్ట్రాలు కూడా వలసదారులకు రేషన్ పంపిణీ కోసం ఈ పథకాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటి వరకూ ఈ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు జూలై 31 లోగా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించింది. వలస కార్మికుల నమోదు కోసం జూలై 31 నాటికి పోర్టల్ సిద్ధం కావాలని కోరింది.కరోనా మహమ్మారి (Corona Pandemic)ముగిసేవరకూ వలసదారులకు ఆహారం అందించేందుకు రాష్ట్రాలు కమ్యూనిటీ కిచెన్లు నడపాలని సుప్రీంకోర్టు(Supreme Court)వెల్లడించింది. 

Also read: Drone Attack in Jammu: జమ్ము సైనిక స్థావరంపై దాడి కేసు ఎన్ఐఏకు అప్పగించిన కేంద్ర హోంశాఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News