Doctors Died During second wave of COVID-19: కులం, మతం, ప్రాంతం, జాతి అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడేందుకు తాపత్రయపడతారు వైద్యులు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కోట్లాది ప్రజల్ని కోవిడ్19 బారి నుంచి కాపాడారు. కానీ ఈ క్రమంలో ఎందరో వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.
కరోనా ఫస్ట్ వేవ్‌ను పక్కనపెడితే, కేవలం కరోనా సెకండ్ వేవ్‌లో ఏకంగా 594 మంది డాక్టర్లు కన్నుమూశారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) తెలిపింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలోనే 107 మంది వైద్యులు మృత్యువాత పడటం విచారకరం. ప్రతి ఇద్దరు వైద్యులలో ఒకరు ఢిల్లీ, బిహార్ లేదా ఉత్తరప్రదేశ్‌లలో కరోనా వైరస్ (CoronaVirus) సెకండ్ వేవ్‌లో చనిపోయారు. 45 శాతం మంది వైద్యులు కేవలం ఈ మూడు రాష్ట్రాల్లోనే కన్నుమూశారు.
Also Read: India Corona Cases Live Updates: ఇండియాలో మళ్లీ పెరిగిన COVID19 మరణాలు, అదొక్కటే ఊరట
కరోనా సెకండ్ వేవ్‌లో చనిపోయిన డాక్టర్ల వివరాలను రాష్ట్రాల వారీగా విడుదల చేసింది. అత్యధికంగా ఢిల్లీలో 107 మంది వైద్యులు చనిపోగా, బిహార్ 96, ఉత్తరప్రదేశ్ 67 మంది కోవిడ్19 (Covid-19 Second Wave) సెకండ్ వేవ్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఈ సంఖ్య ఓ మోస్తరుగానే ఉంది. ఏపీ, తెలంగాణల్లో 32 మంది చొప్పున వైద్యులు చనిపోయారని ఐఎంఏ తమ ప్రకటనలో పేర్కొంది. పాండిచ్చేరి 1, గోవా 2, త్రిపుర 2, పంజాబ్ 3, జమ్మూ కాశ్మీర్ 3, ఛత్తీస్‌గడ్ (3) లలో పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది.
Also Read: EPFO Good News For PF Subscribers: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 3 రోజుల్లో క్లెయిమ్
Indian Medical Association (IMA) says 594 doctors died during the second wave of COVID-19 pic.twitter.com/rbFbwhgL55
— ANI (@ANI) June 2, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook