Curfew guidelines in Indore: ఇండోర్: దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధిస్తే, ఇంకొన్ని చోట్ల వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పాక్షికంగా లాక్‌డౌన్ విధిస్తే, కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉన్న చోట పూర్తిగా లాక్‌డౌన్ (Complete lockdown) విధించారు. ఇలా ఒక్కోచోట ఒకరకమైన కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు శతవిధాల ప్రయత్నిస్తోంటే.. కొంతమంది మాత్రం పూర్తి బాధ్యాతరాహిత్యంగా పనీపాట లేకుండానే రోడ్లపై తిరుగుతుండటం అధికారులకు కోపం తెప్పిస్తోంది. ''మీ కోసం మేము ఇంట్లో ఉండకుండా వీధుల్లోకి వచ్చి డ్యూటీ చేస్తోంటే.. మీరు మాత్రం ఏ పనిలేకుండానే వచ్చి వీధుల్లో తిరుగుతారా'' అంటూ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇదిగో ఈ వీడియో చూడండి.
In Indore district's Depalpur, tehsildar makes people roaming on the streets during the #COVID19 curfew to do frog jumps.
yr jeh sarkari nokar bne ha kya... jeh log to behave ese kr rha jaise raja bn gae ho... #COVIDisAirborne #CovidIndia #CoronaPandemic #CoronaCurfew pic.twitter.com/iebAZZcbaH— rockey singh (@rockeys03560226) May 3, 2021
ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తోన్న వీడియో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లా దెబల్‌పూర్ మండలంలోనిది. ఇక్కడ కరోనా వైరస్ కేసులను (COVID-19 positive cases) నిరోధించేందుకు ఇండోర్ జిల్లా అధికార యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. అయితే స్థానికులు మాత్రం రోడ్లపైకి వచ్చి తిరగడం మానలేదు. దీంతో అలా కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించే వారిపై ఆగ్రహం తెచ్చుకున్న అధికారులు.. ఏ పనీ లేకుండానే ఖాళీగా రోడ్లపైకి వచ్చి తిరిగే వారిని ఇదిగో ఇలా మేళవాయిధ్యాల మధ్య కప్ప గంతులు (Frog jumps) వేయిస్తూ ఊరేగించారు. స్థానిక పోలీసులు సైతం అధికారులకు సహకరించారు.
అలా కప్పగంతులు వేయలేక వేయలేక వేసిన వాళ్లందరికీ నిజంగా ఇది పనిశ్మెంటే కదా. అది కూడా అందరూ చూస్తుండగా ఊరేగింపుగా వెళ్లడం ఇంకా అవమానం. అయితే, ఈ విషయంలో అధికారుల వైఖరిని తప్పుపట్టే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ అధికారులు మాత్రం కర్ఫ్యూ మార్గదర్శకాలు అతిక్రమించిన వారికి ఇదే సరైన శిక్ష అంటున్నారు. ఇండోర్‌లో గత సంవత్సరం భారీ సంఖ్యలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus positive cases) నమోదు కాగా మరణాల సంఖ్య కూడా ఇక్కడి వారిని ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే.