Tamilnadu Assembly Elections: తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ప్రచారం ఆఖరి రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన ప్రచారం పీక్స్‌కు చేరింది. ఈ సందర్బంగా తమిళనాడులో వ్యక్తిపూజ పతాకస్థాయికి చేరింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చేతి బొటనవేలును కోసుకున్నాడు ఓ కార్యకర్త.
మరోవైపు తమిళనాడు ఎన్నికల పోలింగ్ ( Tamilnadu Elections polling) కోసం ఎన్నికల సంఘం (Election Commission) భారీ ఏర్పాట్లు చేసింది. అన్నాడీఎంకే, బీజేపీ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా విజయం తమదేనంటున్నారు డీఎంకే (DMK) అధ్యక్షుడు స్టాలిన్. ప్రచారం చివరి రోజున కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సెల్ఫీల కోసం పలువురు పోటీ పడ్డారు. విరుదునగర్ జిల్లాలో గురవయ్య అనే డీఎంకే కార్యకర్త..స్టాైలిన్ గెలుపు కోసం సాధుర్లోని మారియమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన చేతి వేళ్లు నరికేసుకున్నాడు.
అటు కమల్ హాసన్ ( Kamal Haasan) నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీకు మద్దతుగా నటి సుహాసిని ( Suhasini) తో పాటు కమల్ హాసన్ కుమార్తె అక్షర ప్రచారంలో పాల్గొన్నారు. టార్చ్‌లైట్ గుర్తు చూపిస్తూ గెలిపించాలని కరారు. చెన్నైతోపాటు కోయంబత్తూరులో ఈ ఇద్దరూ ప్రచారం నిర్వహించారు. అక్షరతోపాటు సుహాసిని వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి సేలంలో ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే విజయం ఖాయమని చెప్పారు. మహిళలల్ని అగౌరవపర్చిన డీఎంకేకు గుణపాఠం చెబుతారన్నారు. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(Jp Nadda), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమిళనాడు, పుదుచ్చేరిలలో ప్రచారం నిర్వహించారు.
Also read: India COVID19 Cases: భారత్‌లో కరోనా కలకలం, తొలిసారిగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Apple Link - https://apple.co/3loQYe
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook