Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 1, 2021 Rasi Phalalu, వారికి నూతన అవకాశాలు

Today Horoscope In Telugu 01 April 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 1వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2021, 07:58 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 1, 2021 Rasi Phalalu, వారికి నూతన అవకాశాలు

Horoscope Today 01 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 1వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
పనిలో ఉన్నా లేదా మీ వ్యక్తిగత జీవితంలో అయినా చాలా మంచిగా నెల ప్రారంభించండి. ఈ రోజు మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు మరియు మీ సమస్యలకు సులువుగా పరిష్కారాలను కనుగొంటారు. ఈ రోజు మీకు ఎంతగానో కలిసిరానుంది. ఉద్యోగులు, వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

వృషభ రాశి
ఈ నెల చాలా సానుకూల విషయాలతో  ప్రారంభమవుతుంది. మీ కెరీర్ విషయానికి వస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది. మీ స్వంత పనిలో మీరు చాలా మెరుగుదల చూడవచ్చు. మీ నైపుణ్యంతో ప్రమోషన్ సైతం పొందవచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి మరియు వ్యాయామం చేయడానికి కొంత సమయం కేటాయించండి.

మిథున రాశి
కొత్త నెల ప్రారంభంలో మీరు మీ కార్యాలయానికి సంబంధించిన ఆలోచనలతో ఉన్నారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో మీ ఉన్నతాధికారులకు తెలపండి. అయితే, ఈ రోజు మీ అధిక సమయాన్ని ఆఫీసులో గడపకండి. మీ కుటుంబానికి, మరియు ముఖ్యంగా సన్నిహితులతో సరదాగా సమయం గడపండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి. వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు రావు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది.

కర్కాటక రాశి 
నువ్వు నీలాగే ఉండు. ఇతరులను మెప్పించడానికి మీరు  మార్చుకోవలసిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నవారు మీలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నారని గ్రహించండి. ఆర్థిక విషయానికి వస్తే అదృష్టం మీ వైపు ఉంటుంది, కాబట్టి మీరు ఆస్తిలో కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడి, గందరగోళం నెలకొంటుంది. అధికంగా శ్రమించిన ఫలితం గోచరించడం లేదు.

సింహ రాశి
ఈ రోజు పనిలో విశ్వాసం కీలకం. మీరు యజమాని అయినా ఇతరులకు పని ఎలా చేయాలో చూపించాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు యజమానిని పక్కన పెట్టడానికి ప్రయత్నించండి మరియు మీ కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. ఇంట్లో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 

కన్య రాశి
ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. మీకు కావలసిన దానిపై స్పష్టమైన దృష్టి పెట్టండి. ప్రత్యేకించి ఎవరితోనైనా భాగస్వామ్యం కలిగి ఉంటే ఆ వివరాలు చెక్ చేసుకోండి. వ్యాపారం చేస్తున్నట్లయితే.. మీరు ముందుకు సాగడానికి మరియు రిస్క్ తీసుకోవడానికి ఈ రోజు మంచి రోజు. ఖర్చులు అధికం కానున్నాయి. రుణ యత్నాలు మొదలుపెడతారు. కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి.

తులా రాశి
మీరు కొత్త వ్యక్తులను కలవబోతున్నారు, తద్వారా కొత్త స్నేహాలకు ఇది దారితీస్తుంది. ఆర్థిక విషయానికి వస్తే, మీరు కొంచెం వెనక్కి తగ్గవచ్చు. బదులుగా మీ పనుల మీద దృష్టి పెట్టండి. నేడు మీరు కొంత ఆధ్యాత్మికతకు సమయం కేటాయిస్తారు. మీ అంతిమ లక్ష్యాలు ఏమిటో గుర్తించడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువులు చేతికి అందుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

వృశ్చిక రాశి
ఈ రోజు మీ వృత్తి జీవితంలో మీరు చాలా మార్పులను గమనిస్తారు. అయితే దీనిపై చింతించకండి, ఇది మీకు మంచి మార్పు అవుతుంది. మీ దృష్టిని కొన్ని ప్రాజెక్టులపై ఉంచనున్నారు. వ్యక్తిగత జీవితంలో కొంతమంది వ్యక్తులతో చాలా కష్టపడి గడిపినట్లయితే, నేడు వాటికి పరిష్కారం కోసం యత్నిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది.

ధనుస్సు రాశి
గతంలో మీరు తప్పించుకుంటున్న ఏదో ఒక విషయం మళ్లీ మీ ముందుకు రానుంది. దీన్ని వేరే కోణంలో ఆలోచించి పరిష్కరించుకోవాలి. మీ భయాలను ఎదుర్కోవటానికి ఇది మీకు మరొక అవకాశాన్ని ఇస్తుంది. సమస్యను పరిష్కరించే నైపుణ్యం ఈ రోజు మీకు అధికంగా ఉంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు.

మకర రాశి
ఈ రోజు మకర రాశివారు పరిశుభ్రతకు అధిక సమయాన్ని కేటాయించనున్నారు. మీ ఇల్లు లేదా మీ డెస్క్ అయినా, వ్యాపారం చేసే చోటును పరిశుభ్రంగా ఉంచాలని భావిస్తారు. నేడు మార్పు కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. చాలా కాలం తరువాత ఓ మిత్రుడిని కలుసుకుంటారు. 

కుంభ రాశి
మీ కష్టాలు తొలగనున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ చేయాలి. గతాన్ని ఎక్కువగా తెలుసుకుని ప్రయోజనం ఉండదు. కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. అనారోగ్య సమస్య బాధిస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు.

మీన రాశి
మీ కోసం మీరు నిలబడటానికి వెనుకడుకు వేయవద్దు. మీ ఉపాయం, నైపుణ్యంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. పని పూర్తి చేసి, దానికి పూర్తి క్రెడిట్ తీసుకోండి. కొన్నిసార్లు మీ కంఫర్ట్ జోన్ నుండి వైదొలగడానికి మరియు కొత్త పనులను చేయడానికి ఇది తగిన సమయం. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు పనులలో జాప్యం ఏర్పడుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News