Pawan Kalyan Vs Prakash Raj: పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్.. ఇద్దరు సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో వచ్చిన వారే. పవన్ కళ్యాణ్ రెండు ఎన్నికల్లో దెబ్బ తిని గత ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. మరొకరు 2019 పార్లమెంటు ఎన్నికల్లో బెంగుళూరు సౌత్ నుంచి ఘోరంగా ఓడిపోయారు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో డిప్యూటీ సీఎంగా ఉన్న లీడర్‌ను ఓడిన పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు ట్వీట్‌లతో పవన్ కళ్యాణ్ దండయాత్ర చేస్తున్నాడు. తిరుమల లడ్డు వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో గత వైసీపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు.. విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారా లేదా అనే దానిపై సిట్ బృందం లోతుగా పరిశీలన చేయనుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. అయితే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటకు రాగానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పాటు అందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక స్టెప్ ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి గుడిని శుభ్రం చేశారు. అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చావడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. YCP నేతలు సంస్కార హీనులుగా మాట్లాడుతున్నారని విమర్శల బాణాలు ఎక్కుపెట్టాడు. అయితే ప్రభుత్వంలోని కీలక నేతగా పవన్.. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తంతుపై విమర్శిస్తుంటే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్ వేదికగా చేస్తున్న పోస్టులు వైరల్‌గా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగులో ఆయన మరో పోస్ట్ పెట్టారు. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో సంతోషమేమిటో అంటూ.. జస్ట్ ఆస్కింగ్.. అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ ఘాటుగా స్పందించారు. ప్రకాష్‌రాజ్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని కించపరచలేదన్నారు. అపవిత్రం జరిగిన విషయాన్ని మాత్రమే గుర్తు చేశానన్నారు. సెక్యులరిజం అంటే టూ వే వన్ వే కాదంటూ ప్రకాష్ రాష్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ప్రకాశ్‌రాజ్ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాశ్‌రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. అంతేకాదు సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు.
అయితే తాను చేసిన ట్వీట్‌ను మరోసారి చదువుకోవాలంటూ పవన్ కల్యాణ్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాశ్‌రాజ్. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. తాను ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలపై ప్రకాశ్‌రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పవన్ ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ సంచలనం రేపింది. గెలిచే ముందు ఒక అవతారం. గెలిచాక ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజమని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్ ను మంట పుట్టించేలా ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ఆరోపణలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇటీవలే ప్రకాష్ రాజ్.. పవన్ కల్యాణ్ మధ్య ట్వీట్ వార్ జరిగింది. దాంతో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై ప్రకాశ్ రాజ్ ఓవరాక్షన్ ఎక్కువైందనే వాదనలు సైతం సినీ ఇండస్ట్రీలో మొదలయ్యాయి. తిరుమల లడ్డు వ్యవహారంపై ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులు మాట్లాడలేదు. కానీ ప్రకాశ్ రాజ్ మాత్రం అతిగా స్పందిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఐతే ప్రకాశ్ రాజ్ ట్వీట్ వార్‌పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాష్ రాజ్.. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదని.. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అన్నారు విష్ణు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంతి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ ఇప్పటికే జరిపిస్తున్నారని తెలిపారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారన్నారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ మంచు విష్ణు ప్రశాష్ రాజ్‌కు దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. అయితే మంచు విష్ణు పెట్టిన పోస్ట్‌కు ప్రకాశ్‌రాజ్ కూడా నవ్వుతున్న ఎమోజీలు జోడించి రిప్లై ఇచ్చారు. ఓకే శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది.. అలాగే మీకు కూడా ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి.. జస్ట్ ఆస్కింగ్ అని పేర్కొన్నారు. గతంలోనూ మా ఎన్నికల సందర్భంగా అటు ప్రకాశ్‌రాజ్, ఇటు మంచు విష్ణు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
ఇక ఈ ఏపిసోడ్ కంటిన్యూ అవుతుండగానే తమిళ నటుడు కార్తీ ఎంట్రీ ఇచ్చారు. లడ్డు వివాదంపై తాను చేసిన కామెంట్స్‌కు సారీ కోరారు. పవన్ కళ్యాణ్ సర్ మీకు నా క్షమాపణలు అంటూ కార్తీ ట్వీట్ వేశాడు. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది సర్.. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు చేసుకున్నందకు నేను క్షమాపణలు కోరుతున్నా అని ట్వీట్ లో చెప్పారు కార్తీ. నేను కూడా ఆ వేంకటేశ్వర స్వామికి భక్తుడినే.. నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తానని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే కార్తీకి తమిళ ఇండస్ట్రీ అండగా నిలిచింది. కార్తీ కామెంట్స్‌లో తప్పేక్కడ ఉందని పవన్ కల్యాణ్‌ను తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు ప్రశ్నించారు. అయితే వివాదం కాస్తా కోలివుడ్ వర్సెస్ టాలీవుడ్‌లా మారేలా కనిపిస్తోందనే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోందట. మరోవైపు ఇక్కడే మరొ కొత్త వాదన సైతం వినిపిస్తోంది. కావాలనే ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు పవన్ కల్యాణ్‌ను పదేపదే టార్గెట్ చేస్తున్నారనే టాక్ సైతం వినిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ , కార్తీ వెనుక ఏవైనా రాజకీయ పార్టీలు సైతం ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.
మొత్తంగా ప్రకాశ్ రాజ్ తీరుపై మెగా కుటుంబం సైతం గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ల కిందట హైదరాబాద్ మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు మెగా ఫ్యామిలీ గట్టి మద్దతు ఇచ్చింది. తెలుగు వాడు కాకపోయినా ప్రకాశ్ రాజ్ కు చిరంజీవి సహా మెగా కుటుంబం అండగా నిలిచింది. కానీ.. ప్రకాశ్ రాజ్ మాత్రం తన కృతజ్ఞతను పక్కన పెట్టేసి.. పవన్ కల్యాణ్‌పై పదేపదే విషం చిమ్మడంపైన మెగా ఫ్యాన్స్ సైతం ఫైరవుతున్నారు.
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.