WhatsApp Privacy Policy: చాలా మంది వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది. వాట్సాప్ తన వినియోగదారులలో కొంతమందికి నూతన ప్రైవసీ పాలసీ విధానాన్ని గుర్తు చేయడం ప్రారంభించింది. మే 15 నుండి వాట్సాప్ పనిచేయదని, ఇకనైనా గోప్యతా విధానాన్ని అప్డేట్ చేసుకోవాలని మెస్సేజ్‌లు పంపుతుంది. ఇదివరకే వాట్సాప్ గోప్యతా విధానంపై తీవ్ర విమర్శలు రావడంతో కొన్ని రోజుల కిందట ఆ సంస్థ వెనకడుకు వేయడం తెలిసిందే.
మీరు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఉపయోగించడం కొనసాగించాలనుకుంటే, మే 15 తేదీలోగా కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలని వాట్సాప్ నుండి నోటిఫికేషన్ల స్క్రీన్ షాట్లను చాలా మంది వినియోగదారులు ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు ‘చాట్స్’(Chats) ట్యాబ్‌లో వాట్సాప్ నోటిఫికేషన్‌ను చూపిస్తున్న స్క్రీన్‌షాట్‌ను ట్వీట్లు చేశారు, వాట్సాప్(WhatsApp) తమ నూతన గోప్యతా విధానాన్ని అప్డేట్ చేస్తున్నామని, సమీక్షించిన ప్రైవసీ పాలసీని మీరు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, Silver Price
వినియోగదారుల వ్యక్తిగత చాటింగ్ వివరాలలో గోప్యతను మార్చడం లేదని పేర్కొంటూ దాని కొత్త ప్రైవసీ పాలసీని వాట్సాప్(WhatsApp Privacy Policy) వివరిస్తుంది. మే 15, 2021 నుండి తమ గోప్యతా విధానం అమల్లోకి వస్తుందని, ఆ తేదీలోగా కొత్త ప్రైవసీ పాలసీని ఓకే చేసుకోవాలని.. లేని పక్షంలో వాట్సాప్ వినియోగించలేరని నోటిఫికేషన్లో పేర్కొంది. వాట్సాప్ తన అప్డేట్ చేసిన గోప్యతా విధానంలో భాగంగా వినియోగదారుల వివరాలను తమ పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ సహా ఇతర సంస్థలతో పంచుకోనుందని ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం
కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించినట్లయితే వారి ఫోన్ నంబర్లు మరియు లావాదేవీల డేటా వంటి వినియోగదారు వివరాలను పంచుకోవడానికి వాట్సాప్ అనుమతిస్తుంది. ఇది ఫేస్బుక్(Facebook) మరియు దాని ఇతర అనుబంధ సంస్థలతో డేటాను పంచుకోవడానికి వాట్సాప్‌ను అనుమతిస్తుంది. నూతన ప్రైవసీ పాలసీ ద్వారా కేవలం వాట్సాప్, దాని అనుబంధ సంస్థలకు మాత్రమే ప్రయోజనం చేకూరనుందని, వినియోగదారులకు నష్టమేనని కొందరు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయగా, మరికొందరు అన్ఇన్స్టాల్ చేశారు.
మే 15 లోగా వినియోగదారులు కొత్త పాలసీని అంగీకరించకపోతే, వారు అంగీకరించే వరకు వాట్సాప్ సేవల్ని వినియోగించుకోలేరని అలర్ట్ చేస్తోంది. మరోవైపు వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసుకుని టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్‌లకు భారత వినియోగదారులతో పాటు పలు దేశాల్లో వాట్సాప్ యూజర్లు వేరే యాప్‌లకు స్విచ్ అయ్యారని తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook