/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Sasikala to Chennai: తమిళనాడులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జైలుశిక్ష అనంతరం తొలిసారి చెన్నైకు రానున్నారు చిన్నమ్మ. ఆమె ప్రవేశించకుండా రెండు ప్రాంతాల్లో నిఘా వలయం ఏర్పాటైంది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

తమిళనాడు ( Tamilnadu ) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవినీతి, అక్రమాస్థుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనంతరం విడుదలైన శశికళ ( Sasikala ) తొలిసారి చెన్నైకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. టీనగర్‌లోని హబీబుల్లా రోడ్‌లో ఆమె బసకు ఓ భవనం సిద్ధమైంది. తమిళనాడు సరిహద్దులోని హోసూరు నుంచి చెన్నై వరకూ రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. మొత్తం 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు జరిగాయి. అన్నాడీఎంకే ( AIADMK ) జెండా ఉన్న కారులోనే ఆమె వస్తున్నట్టు తెలుస్తోంది.

ఓ వైపు ఘన స్వాగతానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు అడ్డుకునే ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకే కార్యాలయం ( AIADMK Office ), మెరీనా తీరంలోని జయలలిత సమాధి పరిసరాల్లో శశికళ రాకుండా అడ్డుకునేందుకు నిఘా వలయాన్ని( Tight Security ) ఏర్పాటు చేశారు. నిఘా వలయాన్ని ఛేదించుకుని శశికళ ఆ రెండు ప్రాంతాల్ని సందర్శించనున్నారా లేదా అనేది ఆసక్తి కల్గిస్తోంది. మరోవైపు ఆమెకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్ కమీషనరేట్‌కు విజ్ఞప్తి చేశారు. 

Also read: Driving license New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇకపై టెస్ట్ డ్రైవ్ అవసరం లేదా, కొత్త నియమాలు ఎలా ఉన్నాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Sasikala return to chennai, tight security at two places to prevent her, tension in tamil nadu
News Source: 
Home Title: 

Sasikala to Chennai: నేడు చెన్నైకు శశికళ..అడ్డుకునేందుకు నిఘా వలయం

Sasikala to Chennai: నేడు చెన్నైకు శశికళ..అడ్డుకునేందుకు నిఘా వలయం
Caption: 
Sasikala ( file photo )
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sasikala to Chennai: నేడు చెన్నైకు శశికళ..అడ్డుకునేందుకు నిఘా వలయం
Publish Later: 
No
Publish At: 
Monday, February 8, 2021 - 09:47
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
85
Is Breaking News: 
No