/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Home Remedies For Piles: ప్రస్తుత టెక్నాలజీ కాలంలో గతంలో సాధారణంగా తలెత్తిన సమస్యలు ఇప్పుడు అధికంగా కనిపిస్తున్నాయి. ఆధునిక జీవనశైలి కారణంగా మూలశంక వ్యాధి (Piles) లాంటి వాటి బారిన పడుతున్నారు. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యను మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారని తెలిసిందే

పైల్స్ సమస్య తలెత్తిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి వస్తుంది. నొప్పితో పాటు మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. నీళ్లు అధికంగా తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గడంతో పైల్స్(Remedies For Piles) బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఒకటే ప్రదేశంలో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలో పైల్స్ సమస్య అధికంగా గుర్తించారు. 

Also Read: Throat Pain: గొంతు నొప్పికి చెక్ పెట్టాలంటే ఈ Health Tips పాటించండి

పైల్స్ సమస్యకు బారిన పడకుండా ఉండేందుకు చిట్కాలు (Home Remedies for Piles)

- కాలానికి అనుగుణంగా మంచినీరు(Benefits Of Drinking Water) ఎక్కువగా తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. తద్వారా తగ్గి ఫైల్స్ బారిన పడకుండా ఉంటాం.

 - గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం తగ్గించండి. మూడు గంటల వ్యవధిలో కనీసం రెండుసార్లు లేచి ఓ 5 నిమిషాల పాటు అటుఇటు తిరగడం మంచిది.

- బయట బండ్లపై నూడుల్స్, ఫ్రైడ్ రైస్ ఫాస్ట్ ఫుడ్ లాంటి చిరు తిళ్లకు దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు తింటే శరీరంలో వేడి అధికమై పైల్స్ వచ్చే అవకాశం ఉంది.

- బీన్స్, సోయా బీన్స్ లాంటి అధికంగా పీచు లభించే పదార్థాలు తీసుకుంటే పైల్స్ సమస్య ప్రారంభ దశలో ఉంటే తగ్గిపోతుంది.

Also Read: Hair Loss: మీ జుట్టు రాలుతుంటే ఈ చిట్కాలతో సమస్య పరిష్కరించుకోండి

- తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా ఆఫీసు పనివేళలు, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి మూలశంక వ్యాధి (Piles Problem) వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. వీరు కంటినిండా నిద్ర(Sleeping At Afternoon Benefits) పోవడంతో పాటు తాగునీరు అధికంగా తీసుకోవాలి. 

- అంజీర పండును రాత్రిపూట నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం లేచి పరగడుపున అంజీర తింటే పైల్స్ సమస్య దూరమవుతుంది.

- ప్యాకింగ్ వస్తువులకు బదులుగా, తాజా ఆకుకూరలు, కూరగాయలు తినేవారిలో పైల్స్ సమస్య అత్యంత అరుదుగా వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Also Read: Phone In Toilet: మొబైల్‌ను టాయిలెట్‌లో వాడుతున్నారా.. అయితే ఇది చదవండి

- మలం వచ్చే భాగంలో మీకు కొన్ని రోజులపాటు మంట, ఉబ్బెత్తుగా ఉన్నట్లుగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి.

- పైల్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నవారు ఉదయం, రాత్రి గోరు వెచ్చని పాలు తాగి అర్షకల్ప్ లాంటి ఆయుర్వేద ట్యాబ్లెట్ ఒక్కటి చొప్పున వారం నుంచి పది రోజుల పాటు వేసుకుంటే మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే డాక్టర్లను సంప్రదించి వారి సలహా మేరకు ట్యాబ్లెట్లు వేసుకోడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని మరచిపోవద్దు. 

Also Read: COVID-19 Vaccine: కరోనా టీకా తీసుకున్నా.. వీరికి అంతగా పనిచేయదు 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Home Remedies For Piles: Natural Remedies For Piles Treatment
News Source: 
Home Title: 

Health Tips: పైల్స్ సమస్యను ఎదుర్కొనేందుకు Remedies For Piles పాటించండి

Health Tips: పైల్స్ సమస్యను ఎదుర్కొనేందుకు Remedies For Piles పాటించండి
Caption: 
Home Remedies For Piles (Image for representational purpose only)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో గతంలో పాత తరం సమస్యలు ఇప్పుడు అధికంగా కనిపిస్తున్నాయి

మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు

పైల్స్ సమస్య తలెత్తిన వారికి మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి వస్తుంది

Mobile Title: 
Health Tips: పైల్స్ సమస్యను ఎదుర్కొనేందుకు Remedies For Piles పాటించండి
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Wednesday, January 27, 2021 - 15:26
Request Count: 
268