Cobra attack: పామును పట్టుకో బోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. రెప్పపాటుకాలంలో తప్పించుకున్నాడు కాబట్టి సరిపోయింది..లేదంటే రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయేవాడు..
సాధారణంగా స్నేక్ క్యాచర్ల ( Snake catchers ) కు పాము కాటు ప్రమాదముండదు. ఎలా ఒడుపుగా పట్టుకోవాలో..కాటు పడకుండా ఏం చేయాలో వారికి తెలుసు. కానీ కర్ణాటక ( Karnataka ) రాష్ట్రంలోని శివమొగ్గలో అలా జరగలేదు. భయంకరమైన కోబ్రా కాటేయబోయింది. రెప్పపాటు ఆలస్యమై ఉంటే కాటు పడేదే. ఆ రెప్పపాటులోనే తప్పించుకున్నాడు.
కూలిన ఓ చెట్టు మొదలో పొడవైన కోబ్రా ( Cobra ) చిక్కుకుంది. ఆ పామును రక్షించే ప్రయత్నం చేశాడు స్నేక్ క్యాచర్. ఆ క్రమంలో ఆ కోబ్రా ఎటాక్ చేయబోయింది. పట్టుతప్పి పడిపోయాడు. వెంటనే పాము అతన్ని మరోసారి కాటేయబోయింది. వెంటనే పక్కనున్న అతని సహాయకుడు స్పందించి కోబ్రాను ఒడిసి పట్టుకున్నాడు.
#WATCH | A reptile expert narrowly escapes being bitten by a Cobra snake while trying to catch the animal
Shivamogga, #Karnataka pic.twitter.com/czTc7Zv7pu
— ANI (@ANI) January 12, 2021
ఒళ్లు జలదరింపజేసే ఈ వీడియో సోషల్ మీడియా ( Social media ) లో వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో ఇప్పటికే లక్షకు పైగా జనం చూసేశారు. మిగిలిన మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also read: Free vaccination: కేంద్రం కాదంటే..మేమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook