New coronavirus strain: 2019 చివర్లో కరోనా వైరస్ వణికిస్తే..2020 చివర్లో కొత్త కరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొత్త కరోనా వైరస్ ప్రపంచదేశాల్లో విస్తరిస్తోంది.
యూకే ( UK ) లో గుర్తించిన కొత్త కరోనా స్ట్రెయిన్ ( New corona strain ) ఊహించినట్టే శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా వియత్నాంలో కూడా కొత్త వైరస్ గుర్తించారు. వెంటనే అంతర్జాతీయ విమానాల్ని నిషేధించింది. ఇప్పటి వరకూ 30కి పైగా దేశాల్లో కొత్త కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వేగంగా సంక్రమించే లక్షణం ఉన్నందున అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. స్ట్రెయిన్ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతో, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికా ( America )లోనూ దాదాపు 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. వేగంగా వ్యాప్తి చెందుతుందే తప్ప..పాత వైరస్ అంత ప్రాణాంతకం కాదని వైద్యులంటున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఈ వైరస్‌పై కూడా సమర్ధవంతంగా పని చేస్తాయని చెబుతున్నారు. వైరస్‌లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు.
Also read: Brexit: బ్రెగ్జిట్ అంటే ఏమిటి...బ్రిటన్ లో ఏం మారుతున్నాయి?