False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!

Cyber Frauds | ఇది డిజిటల్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) ఉంటే చాలు ఎన్నో పనులు సులువుగా జరిపోతున్నాయి. మొబైల్ రీచార్జ్ నుంచి విమానం టికెట్ బుకింగ్ వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి

Last Updated : Nov 11, 2020, 06:22 PM IST
    1. రోజురోజుకూ పెరుగోతోన్న ఆన్‌లైన్ మోసాలు
    2. జాగ్రత్తగా ఉండకపోతే డబ్బు, వ్యక్తిగత సమాచారం మాయం
    3. ఈ గ్యాస్ ఎజెన్సీ పోర్టల్ తో జాగ్రత్త
False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!

Online Crimes | ఇది డిజిటల్ యుగం. చేతిలో స్మార్ట్ ఫోన్ ( Smart Phone ) ఉంటే చాలు ఎన్నో పనులు సులువుగా జరిపోతున్నాయి. మొబైల్ రీచార్జ్ నుంచి విమానం టికెట్ బుకింగ్ వరకు అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. దాంతో లక్షలాది మంది నిత్యం అన్‌లైన్‌లో వారి పనులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి కొత్తగా కొన్ని ఫేక్ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి ఒక పోర్టల్ గురించి ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో (PIB) తేల్చి చెప్పింది. 

ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం

ఉజ్వలా గ్యాస్ ఏజెన్సీకి చెందిన వెబ్‌సైట్‌ అంటూ ఒక పోర్టల్ ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. www.ujjwalagasagency.org అనే వెబ్ సైట్ లో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పింది. ప్రజలు ఇలాంటి తప్పుడు పోర్టల్స్ తో ( Fake Website ) కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. 

ALSO READ| Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..

ప్రజలు ఇలా సోషల్ మీడియాలో ( Social Media ) వచ్చే సందేశాలను నిజంగా భావించి మోసపోతుంటారు అని తెలిపింది. ఫేక్ వెబ్‌సైట్ల వల్ల చాలా మంది డబ్బును కోల్పోవడం, వ్యక్తిగత వివరాల గోప్యత కోల్పోవడం జరుగుతుంది. అందుకే సోషల్ మీడియాలో వచ్చే మెసేజెస్ పై స్పందించే ముందు అందులో నిజం ఎంత ఉందో చెక్ చేయడం మంచిది అని సలహానిస్తోంది ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Dont Miss These Stories |

Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…

Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది

 

Trending News