Covid-19 Death Toll: మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

Maharashtra Covid-19 Death Toll | వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆదివారం విడుల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో తాజాగా 5,369 పాజిటివ్‌ కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 10,318కి చేరింది. 

Last Updated : Nov 2, 2020, 09:22 AM IST
Covid-19 Death Toll: మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. తాజాగా మహారాష్ట్రలో కోవిడ్-19 మరణాల సంఖ్య 44 వేలు దాటింది. కొన్ని రోజుల కిందటితో పోల్చితే కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఆదివారం విడుల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో తాజాగా 5,369 పాజిటివ్‌ కేసులు, 113 మరణాలు నమోదయ్యాయి. 

 

మహారాష్ట్రలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,83,775కు చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 44,024కు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,726 మంది కరోనా బారి నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ 15,14,079కు చేరినట్లు హెల్త్ బులెటిన్‌లో మహారాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,25,109 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

 

మహారాష్ట్ర కరోనా రికవరీ రేటు 89.92శాతంగా ఉంది. కోవిడ్19 మరణాల రేటు 2.61 శాతం నమోదైంది. ఇప్పటివరకూ 90,24,871 కరోనా నిర్ధారణ పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించారు. ముంబైలో కరోనా మరణాల సంఖ్య 10,318కి చేరింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News