ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ( Corona virus ) పై మొట్టమొదటి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేసింది. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన రష్యా...ప్రజలకు ఆ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమైందని రష్యన్ మీడియా వెల్లడించింది.
కరోనా వైరస్ నియంత్రణలో వ్యాక్సిన్ ఒక్కటే విరుగుడనేది అందరూ నమ్మే మాట. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ వ్యాప్తంగా అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్ ( Corona vaccine ) తయారీలో నిమగ్నమయ్యాయి. వివిధ కంపెనీల వ్యాక్సిన్ లు తుదిదశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే మొట్టమొదటి వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేశామని ప్రకటించిన రష్యా ( Russia )..ఇప్పుడు ప్రజలకు సరఫరా చేసేందుకు కూడా సిద్ధమైపోయింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యన్ మీడియా వెల్లడించింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ( Sputnik v vaccine ) ను మాస్కోలో సరఫరా చేసేందుకు అందుబాటులో వచ్చేసిందని ఆ దేశపు మీడియా ప్రకటించింది. వ్యాక్సిన్ సరఫరాను త్వరలోనే ప్రారంభిస్తామని గత వారమే రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Russia Health ministry ) స్పష్టం చేసింది. ప్రజలకు సరఫరా చేసేందుకు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ బ్యాచ్ లు ఇప్పటికే సిద్ధమయ్యాయని..పలు ప్రాంతాలకు తరలిస్తామని చెప్పింది. ముందుగా వైరస్ ముప్పు ఉన్న గ్రూపులు, ఉపాధ్యాయులు, వైద్యులకు వ్యాక్సినేషన్ చేస్తామని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మైఖేల్ మురష్కో తెలిపారు. Also read: School bus-sized asteroid: భూమికి దగ్గరిగా రానున్న ఆస్టరాయిడ్
కరోనా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా ప్రజలకు అందిస్తామని రష్యా ముందు నుంచే చెబుతోంది. అయితే కీలకమైన మూడోదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే వ్యాక్సిన్ పై రష్యా తొందరపాటుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన భద్రత, సామర్ధ్యంపై డబ్ల్యూహెచ్ వో సహా పలు దేశాలు, వైద్య నిపుణులు సైతం సందేహం వ్యక్తం చేసిన పరిస్థితి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్ ( Gamaleya institute ) అభివృద్ది చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్ని రష్యా ఏకంగా 40 వేలమందిపై నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాల్ని భారత్ లో చేపట్టేందుకు, ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు భారతీయ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ( Dr Reddys laboratories ) తో ఒప్పందమైంది.
ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో రష్యన్ వ్యాక్సిన్ ప్రజల ముందుకు రావడం ఆశాకిరణంలా కనిపిస్తోంది. Also read: Agriculture Bill: బిల్లుకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్
Sputnik v vaccine: శుభవార్త చెప్పిన రష్యా, అందుబాటులో వ్యాక్సిన్
స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సరఫరాకు సిద్ధమని ప్రకటించిన రష్యా
త్వరలో పంపిణీ ప్రారంభమని చెబుతున్న రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఉత్పత్తి, పంపిణీకు భారతీయ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ తో ఒప్పందం