Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి.

Last Updated : Sep 10, 2020, 09:37 AM IST
Ram Gopal Varma: కరోనా సోకిన భారత్‌కు.. కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు

Ram Gopal Varma sensational tweets about Kangana Ranaut: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చెప్పదలుచుకున్నారో.. ఖరాఖండిగా చెప్పేస్తారు. అందుకే ఆయన తరచూ వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తారు ఎప్పుడూ తనదైన స్టైల్లో సినిమాలు తీసి వివాదాస్పద దర్శకుడిగా.. పేరు గడించిన రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. సుశాంత్ ఆత్మహత్య నాటినుంచి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. నిన్ననే కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి మరీ.. ముంబైకు వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుంచి మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా మర్మ ట్విట్ చేసి మరింత వేడిక్కించారు. Also read: Kangana Ranaut: ఉద్ధవ్ థాకరే..ఇదే నీకు నా ఛాలెంజ్

పరిస్థితి చూస్తుంటే కంగనా రనౌత్‌ మహారాష్ట్రకు తదుపరి సీఎంగా అవతరిస్తుందని అనిపిస్తోంది. అదే జరిగితే బాలీవుడ్‌ మొత్తం సైగర్‌ నది ఒడ్డున ఉన్న టింబక్‌టూ ప్రాంతానికి మకాం మార్చాల్సిందే. కంగన సీఎం, ఓ మీడియా ఓనర్ పీఎం అయిన తర్వాత శివసేన కనుమరుగవుతుంది. అప్పుడు ముంబై పోలీసులను ఓ టీవీ ఛానెల్ రీప్లేస్‌ చేస్తుంది. అప్పుడు కాంగ్రెస్‌ ఇటలీకి పారిపోతుంది. కరోనా సోకిన భారత్‌కు, కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్‌ లేదు. అంటూ తనదైన స్టైల్లో మూడు ట్వీట్లు చేశారు వర్మ. ఏదీఏమైనప్పటికీ వర్మ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి.. Also read: Kangana Ranaut: ముంబై బయలుదేరిన కంగనా.. ఏమని ట్విట్ చేసిందంటే..?

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x