/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

COVID-19 rules violations: ఫిరోజాబాద్: కొవిడ్-19 మార్గదర్శకాలు, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వారికి ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ పోలీసులు, అక్కడి అధికారులు ఓ వెరైటీ శిక్ష విధిస్తున్నారు. మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి తమదైన స్టైల్లో శిక్ష విధిస్తూ మరోసారి ఆ తప్పు చేయకుండా చేస్తున్నారు. ఇంతకీ ఆ శిక్ష ఏంటనే కదా మీ సందేహం...!! మరేం లేదండీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారి చేత '' మాస్క్ లగానా హై '' ( Mask lagaana hai ) అంటూ 500 సార్లు రాయించడమే పోలీసులు విధిస్తున్న ఇన్‌స్టంట్ పనిష్మెంట్. ''మాస్క్ లగానా హై '' అంటే మాస్క్ ధరించాలి అని అర్ధం. 

కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) నిరోధించేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందేనని కేంద్రం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. అందుకే ప్రభుత్వానికి సహకరించకుండా నిర్లక్ష్యంగా రోడ్లపైకి వస్తూ కోవిడ్-19 నిబంధనలు ( COVID-19 norms ) ఉల్లంఘించిన వారిని 3-4 గంటల పాటు కూర్చోబెట్టి మాస్క్ ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటో వివరిస్తూ ఫిరోజాబాద్ పోలీసులు, అధికారులు ఓ క్లాస్ తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని వారి చేత 500 సార్లు మాస్క్ లగానా హై అంటూ రామకోటి రాసినట్టు రాయించడం ఈ శిక్షలో ఓ భాగం. దీనినే స్ధానికులు 'మాస్క్ కీ క్లాస్' ( Mask ki class ) అని కూడా పిలుచుకుంటున్నారు. 

ఫిరోజాబాద్ ఎస్ఎస్‌పి సచింద్ర పటేల్ ఈ విషయంపై స్పందిస్తూ.. నిబంధనలు పాటించని వారిపై పోలీసు యాక్షన్ ( Police action ) ఏమీ ఉండదని... కాకపోతే వారిని కూర్చోబెట్టి హితబోధ చేయడం జరుగుతుందని అన్నారు. మాస్కులు ధరించడం ( Wearing masks ) వల్ల కలిగే లాభాలు ఏంటో వివరిస్తున్న ఓ వీడియోను ప్రదర్శించి చూపిస్తాం. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. కౌన్సిలింగ్ ( Councelling ) కూడా పూర్తయిన అనంతరం మాస్క్ లగానా హై అంటూ రాయిస్తాం అని సచింద్ర పటేల్ తెలిపారు. ఈ వెరైటీ శిక్ష ఏదో వారికి కూడా జ్ఞానోదయం కలిగించేదిగానే ఉంది కదూ!!

Section: 
English Title: 
UP Police asks COVID-19 rules violators to write ‘Mask Lagana Hai’ 500 times as punishment
News Source: 
Home Title: 

COVID-19 rules: మాస్క్ లేకుండా పట్టుబడితే.. ఇక అంతే

COVID-19 rules: మాస్క్ లేకుండా పట్టుబడితే.. ఇక అంతే
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
COVID-19 rules: మాస్క్ లేకుండా పట్టుబడితే.. ఇక అంతే
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 14, 2020 - 19:14