న్యూఢిల్లీ: కరోనా కష్టాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి. ఒక్కరోజులోనే తొలిసారిగా గడిచిన 24 గంటల్లో 19,906 కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయని , దేశవ్యాప్తంగా మొత్తం 5,28,859 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా శనివారం నాడు 410 మంది COVID-19 బారిన పడి మరణించారని దీంతో మొత్తం మరణాల సంఖ్య 16,095కు చేరుకుంది. ఒకే రోజులో 19,000 కంటే ఎక్కువగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, రష్యా తరువాత కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అత్యధికంగా వ్యాపిస్తున్న దేశాలలో భారతదేశం నాలుగవది. జూన్ 30 నుంచి మార్కెట్లోకి Realme X3 స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్లు మీకోసం
Also Read: ఆకలినైన భరిస్తాం.. కానీ జొమాటోలో కొనసాగలేం..
కరోనావైరస్ కాసులు 15 వేలకు పైగా పెరగడం ఇది వరుసగా ఐదవ రోజు. అయితే జూన్ 1 నుండి ఇప్పటి వరకు 3,38,324 కేసులు పెరిగాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదు కాబడ్డాయి. ఇప్పటివరకు రాష్ట్రాల వారిగా మహారాష్ట్ర (1.59 లక్షల కేసులు, 7,243 మరణాలు), ఢిల్లీ (80,188 కేసులు, 2,558 మరణాలు), తమిళనాడు (78,355 కేసులు, 1,025 మరణాలు) దేశవ్యాప్తంగా మొత్తం కేసుల్లో ఈ రాష్ట్రాల్లోనే 63.7 శాతం నమోదయ్యాయి. పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ