ఏపీలో కరోనా కల్లోలం.. తాజాగా ఓ జిల్లాలో ఇద్దరు మృతి

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. తాాజాగా ఏపీలో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

Last Updated : Jun 5, 2020, 01:36 PM IST
ఏపీలో కరోనా కల్లోలం.. తాజాగా ఓ జిల్లాలో ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు (Andhra Pradesh COVID19 Cases) రికవరీ అధికంగానే ఉన్నా భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో తాజాగా 50 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3427కు చేరింది. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనాతో చనిపోయారు. కోవిడ్19 (COVID-19) మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఈ రెండు మరణాలు సంభవించడం గమనార్హం. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 73కి చేరింది. నేటి రాత్రి చంద్రగ్రహణం.. మూడు గంటలకు పైగా అకాశంలో అద్భుతం

గడిచిన 24 గంటల్లో ఏపీలో 9,831 శాంపిల్స్‌ పరీక్షించగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో కలపి రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,427కి చేరింది. ఇందులో చికిత్స అనంతరం 2,294 మంది డిశ్ఛార్జ్‌ కాగా, ప్రస్తుతం 1,060 మంది చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు: హరీష్ రావు

రాష్ట్రంలో తాజాగా ఇద్దరు మరణించగా.. కృష్ణా జిల్లాలో మరణాలు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 123 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, ఇందులో కరోనా నుంచి నలుగురు కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 700 మందికి కరోనా పాజిటివ్‌ తేలగా, ప్రస్తుతం 442 యాక్టీవ్‌ కేసులున్నాయి. తాజాగా 14 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
  
బీ అలర్ట్.. గంటల తరబడి కూర్చుంటున్నారా! ఇది చదవండి

Trending News