హైదరాబాద్ : తెలంగాణలో గురువారం నాడు కొత్తగా 66 కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( Coronavirus positive cases ) నమోదయ్యాయి. అందులో ఇద్దకు వలస కూలీలు ఉండగా మరో 49 మంది సౌది అరేబియా ( Saudi Arabia deportees ) నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1908కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో చేరిన వారిలో 175 మంది వలస కార్మికులు ( Migrant workers ) ఉన్నారు. సౌదీ అరేబియా నుండి వచ్చిన అనంతరం కరోనావైరస్ గుర్తించిన వారి సంఖ్య మొత్తం 143కి చేరింది. విదేశీ ప్రయాణీకులు ( Foreigners ) మరో 30 మంది వరకు ఉన్నారు. అలా చూసుకుంటే తెలంగాణలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2256 ( 1908 + 348 ) గా ఉంది. ( ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 1024 కేసులు నమోదు )
తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన మృతుల సంఖ్య ( Corona deaths in Telangana ) మొత్తం 67 చేరింది. ఇప్పటి వరకు 1345 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 844 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సౌదీ అరేబియా నుండి వచ్చిన వారిలో తెలంగాణ వారు మాత్రమే కాకుండా దేశం నలమూలల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టంచేసింది. వీరిలో చాలామందికి సౌదీలోనే కరోనా వైరస్ సోకినప్పటికీ.. అది ఇక్కడికి వచ్చిన తరువాత చేస్తున్న పరీక్షల్లోనే ( COVID-19 screening ) బయటపడినట్టు గుర్తించారు. వీరంతా ప్రస్తుతం ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ క్వారెంటైన్ సెంటర్స్‌లో ( Quarantine centres ) ఉన్నారు. వందే భారత్ మిషన్‌లో ( Vande Bharat Mission ) భాగంగా విదేశాల నుంచి.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాద్, కేరళలోని కొచ్చికి ఎక్కువ సంఖ్యలో విమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ( భారత్‌ను వణికిస్తోన్న కరోనా.. ఒక్కరోజులో 175 మంది మృతి )
గురువారం రాత్రి తాజా హెల్త్ బులెటిన్‌ని విడుదల చేసిన తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ.. 10 ఏళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, వారికి కరోనావైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉందని స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..