Aishwarya Rajesh | సినీ ఇండస్ట్రీ అదో రంగుల ప్రపంచం. అప్పుడే పూల వర్షం, అంతలోనే విమర్శలు తూటాలు, దుష్ప్రచారం, వదంతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటీమణుల విషయానికొస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఫేమ్, నటి ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నా రంగు, అందం, ఆకారం అంటూ వేధింపులకు గురయ్యానని, సినిమా అవకాశాల విషయంలోనూ తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఐశ్వర్య రాజేష్ తెలిపారు. ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్
సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారితో పాటు.. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకు వేధింపులు తప్పలేదన్నారు. అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదని, టాలెంట్‌ను నమ్ముకంటే అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఈరోజు ఇలా మీముందు నిలబెట్టిందంటూ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశం అవుతున్నాయి. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నీ రంగు ఎలా ఉందో తెలుసా, అద్దంలో ముఖం చూసుకున్నావా, నువ్వు ఇలా ఉన్నావు.. నీకు అవకాశాలు ఎవరిస్తారంటూ ఎగతాళి చేశారని పాత రోజులను ఐశ్వర్య రాజేష్ గుర్తు చేసుకున్నారు. ఆడియెన్స్ సైతం నువ్వు హీరోయినా అంటూ కామెంట్ చేసేవారని, అక్కాచెల్లెలు, ఇతర క్యారెక్టర్లు చేస్తే మేలని సలహాలు ఇచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సెట్ ధ్వంసం చేసి వీడియోలు.. సీఎం ఆగ్రహం
నాన్న, అన్నయ్యల వరుస మరణాలు.. విషాదగాథ
నటుడు రాజేష్ కూతురే ఈ ఐశ్వర్య రాజేష్. వీరు చెన్నైలో ఉండేవాళ్లు. నటికి 8 ఏళ్ల వయసులో నాన్నను కోల్పోయింది. నటుడు రాజేష్ చనిపోవడం కుటుంబానికి పెద్ద షాక్. మరో మూడు నాలుగేళ్ల తర్వాత ఇంటికి పెద్దదిక్కు అయిన పెద్దన్నయ్య చనిపోయాడు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో అన్నయ్య మరణం ఐశ్వర్య రాజేష్ కుటుంబాన్ని కోలుకోకుండా చేసింది.
పరిస్థితి దిగజారడంతో నేను సీరియల్స్‌లో నటించి కుటుంబాన్ని పోషించాను. చాలా తక్కువ వచ్చేవి. సినిమాల్లో చేయాలని అమ్మ ఇచ్చిన సలహాతో ఇండస్ట్రీకి వచ్చాను. కానీ నా రంగు, అందం అంటూ వంకలు పెట్టారు కానీ మద్దతు దొరకలేదని చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..