'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో చాలా కాలనీలు, నివాస ప్రాంతాలను పోలీసులు కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. ఆయా కాలనీలకు, నివాస ప్రాంతాలకు బారికేడ్లు పెట్టి కాపలా కాస్తున్నారు. అంటే ఆ ప్రాంతం నుంచి ఎవరూ బయటకు రావొద్దు. ఎవరూ లోపలికి వెళ్లవద్దన్నమాట. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులను మున్సిపల్ సిబ్బంది సరఫరా చేస్తారు.
ఐతే ఈ రోజు ఒడిశాలోని రూర్కెలాలో ఓ కంటైన్మెంట్ జోన్ నుంచి పోలీసులు బారికేడ్లు తొలగించారు. అంటే ఆ ప్రాంతాన్ని డీకంటైన్మెంట్ జోన్‌గా నిర్ధారించడంతో అక్కడి నుంచి బారికేడ్లు తొలగించారు. కానీ ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న మిగతా ప్రాంతాలన్నీ కంటైన్మెంట్ జోన్లుగానే ఉన్నాయి. దీంతో ఆ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమీపంలో కంటైన్మెంట్ జోన్లు ఉండగా .. తమ ప్రాంతం నుంచి బారికేడ్లు ఎలా తొలగిస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగింది. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపైకి స్థానికులు రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. లాఠీఛార్జి చేశారు. ఎంతకీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో .. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఒడిశాలో ఉద్రిక్తత..!!