ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్నవారికి బ్యాంకులో కచ్చితంగా పని ఉంటుంది. అసలే ఇది కరోనా క్లిష్ట కాలం కావడంతో బ్యాంక్ సెలవులు, పని దినాలు తెలుసుకుని మీ పనుల్న చక్కబెట్టుకోవడం ఉత్తమం. మే 1న శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు బ్యాంకులు పనిచేయవు. ఈ నెలలో పవిత్ర రంజాన్ మాసం వచ్చింది. మే 25న రంజాన్ పండగను పురస్కరించుకుని బాంకులకు సెలవు. భారీగా పెరిగిన వెండి ధరలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే డే, రంజాన్ కాకుండా మరిన్ని రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. మే నెలలో 5 ఆదివారాలున్నాయి. ఈ ఆదివారాలైన 3, 10, 17, 24, 31 తేదీల్లో బ్యాంకులకు సెలవు. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. మే 9, మే 23 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. Pics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!
మొత్తంగా చూస్తే మే నెలలో 5 ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, మే డే, రంజాన్ పండగలతో కలిపి 9 రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. వీటి దృష్ట్యా బ్యాంకు పనులు ఆలోచించి చేసుకోవాలి. అయితే బ్యాంకులు పనిచేయకున్నా ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఉన్న ఖాతాదారులకు ఏ ఇబ్బంది ఉండదు.. నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లింపులు, నగదు బదిలీ చేసుకునే వీలుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!