అరుదైన కేన్సర్ వ్యాధితో కన్నుమూశారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇవాళ ( గురువారం) ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఇంకా శోక సంద్రం నుంచి తేరుకోలేదు.
మరోవైపు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు తమదైన పంథాలో సంతాపం తెలియజేశారు. ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ఈ తరుణంలో సాటి కళాకారుని మృతికి తనదైన శైలిలో నివాళులర్పించారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.
ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఇసుకతో కళాఖండాన్ని రూపొందించారు. ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఇర్ఫాన్ ఖాన్ చిత్రానికి పక్కనే మిస్ యూ ఇర్ఫాన్ అని రాశారు. అంతే కాదు ఆయన నటించిన లైఫ్ ఆఫ్ పై చిత్రంలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నాట్ టేకింగ్ ఏ మూవ్ మెంట్ టు సే గుడ్ బై' డైలాగ్‌ను ఇర్ఫాన్ ఖాన్ చిత్రం పక్కనే రాశారు. అలాగే RIP అని రాశారు.
Heartfelt tribute to the Bollywood legend #IrrfanKhan on his untimely demise. My SandArt at Puri beach with message “... not taking a moment to say goodbye “ . #RIP🙏 pic.twitter.com/XomsfwOgTm
— Sudarsan Pattnaik (@sudarsansand) April 29, 2020
పూరీ బీచ్‌లో ఆయన రూపొందించిన ఇర్ఫాన్ ఖాన్ సైకత శిల్పానికి చెందిన ఫోటోలను సుదర్శన్ పట్నాయక్.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు 'నా హృదయ పూర్వక శ్రద్ధాంజలి' అంటూ ట్వీట్ చేశారు.