ఈ రోజు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన అతిథి ఇవాంకా ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీలకు ఒక వినూత్న రీతిలో స్వాగతం పలకడానికి సదస్సు నిర్వాహకులు ప్రయత్నించారు. "మిత్ర" అనే ఒక రోబోట్ ద్వారా వారు స్వాగతం చెప్పించారు. బెంగుళూరుకి చెందిన ఇన్వెంటో రోబోటిక్స్ అనే స్టార్టప్ తయారుచేసిన ఈ రోబోట్‌ను ఇవాంకా చేతుల మీదుగా సదస్సులో ఆవిష్కరించారు. ఈ రోబో నడుస్తూ వచ్చి తొలుత అతిధులకు స్వాగతం పలికింది.
తర్వాత అతిధులు రోబో వద్దకు వెళ్లి కరచాలనం చేయగా "వెల్ కమ్ ఇవాంకా.. వెల్ కమ్ మోడీ.." అని అది పలకరించడంతో... సదస్సు మొత్తం నవ్వులు విరబూసాయి. ఇవాంకా కూడా ఆ రోబోకు హాయ్ చెప్పి, తర్వాత థాంక్యూ చెప్పారు. ప్రస్తుతం పలు బ్యాంకుల్లో సాధారణ కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్‌లు చేసే పనిని మిత్రా రోబోట్ చేయడం విశేషం. ప్రస్తుతం కెనరా బ్యాంకు లాంటివి ఈ రోబోట్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నాయి.