'కరోనా' నుంచి కోలుకున్నాడు.. పుట్టిన రోజు చేసుకున్నాడు. అవును మీరు విన్నది నిజమే. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. అతి కొద్ది కాలంలోనే లక్షల మందికి వ్యాప్తి చెందిన వైరస్ కారణంగా జనం పిట్టల్లా రాలుతున్నారు. కానీ ఓ వృద్ధుడు మాత్రం .. కరోనా వైరస్ ను ఎదురించి నిలబడ్డాడు.
ఆయన పేరు విలియమ్ బిల్ లాఫిస్. వయసు ప్రస్తుతం 104 సంవత్సరాలు. ఓరేగాన్ లో నివసిస్తున్న ఆయనకు మార్చి 5న కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. ఆయన ఉంటున్న ప్రాంతంలో 15 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. కానీ కొద్ది రోజుల చికిత్స అనంతరం వారు అంతా చనిపోయారు. విలియమ్ బిల్ లాఫిస్ మాత్రం వైరస్ ను తట్టుకుని సురక్షితంగా బయటపడడం విశేషం.
అంతే కాదు ఈ వృద్ధునికి మరో చరిత్ర కూడా ఉంది. గతంలో రెండో ప్రపంచ యుద్ద సమయంలో అప్పట్లో స్పానిష్ ఫ్లూను కూడా ఎదుర్కున్నారు. అప్పుడు కూడా ఆ ఫ్లూ బారిన పడి ప్రాణాలు దక్కించుకున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడ్డా తనకున్న వ్యాధి నిరోధక శక్తితో తట్టుకుని .. చికిత్స ద్వారా కోలుకున్నారు.
'కరోనా' ఉన్నా ఆరోగ్యవంతమైన శిశువు
మరోవైపు ఆయన పుట్టిన రోజు ఏప్రిల్ 1 నాటికి పూర్తిగా కోలుకుని.. ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి చేరుకోవడం విశేషం. అదే రోజు కుటుంబ సభ్యులంతా ఆ ఆనందాన్ని ఇరుగుపొరుగు వారితో పంచుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ అందరికీ పార్టీ ఇచ్చారు. పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..