Railway Ticket Concession: మరి కొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ఉంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించనున్నారు. దేశమంతా ఈ బడ్జెట్ కోసం చూస్తోంది. వివిధ రంగాల ప్రజలు బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా రైల్వే టికెట్ల విషయంలో సీనియర్ సిటిజన్లు చాలా నమ్మకం పెట్టుకున్నారు.
ఫిబ్రవరి 1న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో అన్ని వర్గాలవారికి ఆశలున్నట్టే సీనియర్ సిటిజన్లు రైల్వే రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి కంటే ముందు రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేది. కరోనా సమయంలో ఆర్ధిక కారణాలో ఈ సబ్సిడీని తొలగించారు. అప్పట్నించి ప్రతి బడ్జెట్‌లో రాయితీ పునరుద్ధరించాలని కోరుతూ వస్తున్నారు. రేపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ మోదీ మూడో దఫా ప్రభుత్వంలో మొదటిది. ఈసారైనా రైల్వే టికెట్లలో గతంలో ఇచ్చిన 40-50 శాతం సబ్సిడీని తిరిగి పునరుద్ధరించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్లలో 40-50 శాతం రాయితీ మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజథాని, శతాబ్ది, దురంతో రైళ్లకు వర్తించేది. 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ, 58 ఏళ్లు దాటిన మహిళలకు 50 శాతం రాయితీ ఉండేది. అయితే కోవిడ్ సమయంలో ఈ రాయితీని ప్రభుత్వం రద్దు చేసింది.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రైల్వే టికెట్ల రాయితీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు. అదే జరిగితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తులు అందాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి