Amit Shah Ambedkar Comments Row: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో చిచ్చురేపాయి. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తముతోంది. ఆ వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారకపోగా ఆంధ్రప్రదేశ్‌లో అతడి పర్యటన సందర్భంగా రాజకీయంగా మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర పరాభవం ఎదురైంది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన అమిత్ షాకు వామపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అమిత్ షా పర్యటనను అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం చేశారు. వామపక్షాల ఆందోళనతో అమిత్ షా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Also Read: Tirumala: తిరుమలలో మరో వివాదం.. వైకుంఠ ద్వార పుష్పాలంకరణపై రచ్చ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీలు ఆదివారం కాకినాడలో భారీ ఆందోళన నిర్వహించాయి. సీపీఐ, సీపీఐ(ఎం) , లిబరేషన్, సీపీఐ ఎంఎల్ తదితర వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడిన అమిత్ షా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా పదవులు అనుభవిస్తున్న అమిత్ షా అతడి గురించే విమర్శించడం సరికాదన్నారు.
Also Read: Chandrababu Tour: వైఎస్ జగన్ అడ్డాలో సీఎం చంద్రబాబు.. రేపు ఏం జరగనుంది?
గో బ్యాక్.. గో బ్యాక్ అమిత్ షా
కృష్ణాజిల్లా గన్నవరంలో కూడా వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. గన్నవరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టాయి. గో బ్యాక్.. గో బ్యాక్ అమిత్ షా అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారని తెలిపారు.
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
కేంద్ర మంత్రి అమిత్ షా అంబేడ్కర్‌ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం నందికొట్కూరులో సీపీఎం నాయకులు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.