Sai Pallavi: చిరు, విజయ్,అజిత్ ఎవడైతే నాకేంటి.. క్యారెక్టర్ నచ్చకపోతే చేసేదేలేదంటున్న సాయి పల్లవి..

Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి  గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యాక్ట్ చేస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతేకాదు సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా.. పాత్ర నచ్చితేనే చేసే అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. పాత్ర నచ్చన బడా స్టార్ హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయడం కేవలం ఆమెకే చెల్లింది.

1 /6

చిరంజీవి, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు ఒదలుకోరు. కానీ సాయి పల్లవి మాత్రం ఆయా సినిమాల్లో చాన్సెస్ వచ్చినా.. పాత్ర నచ్చన ఆయా సినిమాలు రిజెక్ట్ చేసింది.

2 /6

భోళా శంకర్.. భోళా శంకర్ సినిమాలో ముందుగా చిరు చెల్లెలు పాత్ర కోసం సాయి పల్లవినే సంప్రదించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి.  

3 /6

లియో.. విజయ్ హీరుగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం ఇందులో తన క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసింది.

4 /6

వలిమై.. అజిత్ హీరోగా తెరకెక్కిన ‘వలిమై’ సినిమా లో హీరోయిన్ పాత్ర ఆఫర్ వచ్చినా.. అందులో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించింది.

5 /6

వారసుడు.. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్వకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. ఈ సినిమాలో ముందుగా రష్మిక పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారు. కానీ అందులో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి.

6 /6

చెలియా.. మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే ఎవరైనా ఓకే చెప్పేస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం కార్తి హీరోగా తెరకెక్కిన ‘చెలియా’ సినిమాలో ఛాన్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. మొత్తంగా హీరో ఎవరైనా తన పాత్ర నచ్చితేనే ఓకే చెప్పడం సాయి పల్లవి గట్స్ కు నిదర్శనం.