Basti Dawakhana Recruitment 2025 Notification: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు బంపర్ ఛాన్స్ అందించింది. నిజామాబాద్ వ్యాప్తంగా ఉన్న బస్తీ దాబాఖానాల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ ఉద్యోగాల బత్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Basti Dawakhana Recruitment 2025 Notification: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అద్భుతమైన శుభవార్త తెలిపింది. నగరాల వ్యాప్తంగా ఉన్న బస్తీ దావాఖానాల్లో ఖాళీ ఉన్న కొన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. నగరవ వ్యాప్తంగా ఉన్న వివిధ బస్తీ దావాఖానాల్లో ఖాళీ ఉన్న మెడికల్ ఆఫీసర్ తో పాటు స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ నర్స్ అని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఉద్యోగ అర్హతలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హత వివరాల్లోకి వెళ్తే.. అయితే మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు తప్పకుండా గతంలోనే ఎంబిబిఎస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక స్టాఫ్ నర్సింలు అయితే బీఎస్సీ నర్సింగ్, సపోర్టు నర్సులు పదో తరగతి పాస్ అయినవారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. మెడికల్ ఆఫీసర్స్‌కి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల్లోకి తీసుకుంటే.. ఇక నర్సులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ నోటిఫికేషన్ లో దరఖాస్తు చివరి తేదీని కూడా వెల్లడించారు. జనవరి 24వ తేదీ వరకు ఈ ఉద్యోగాలను అప్లై చేసుకునే వారు చేసుకోవచ్చు..
ప్రస్తుతం ఈ ఉద్యోగాల దరఖాస్తుకు సంబంధించిన నోటిఫికేషన్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సంబంధించిన కార్యాలయం నుంచి విడుదలైనట్లు నోటిఫికేషన్ లో క్లుప్తంగా పేర్కొన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వారే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే త్వరగా జాబ్ పొందే అవకాశాలున్నాయి.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 15 పోస్టులకు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ నోటిఫికేషన్ లో భాగంగా జీతాలను కూడా వెల్లడించారు. ఇందులోని ప్రధాన మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన వారికి దాదాపు ప్రతినెల రూ.52 వేల నుంచి జీతం అందించబోతున్నట్లు తెలిపారు.
ఇక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి.. ప్రతి నెల రూ. 29 వేల నుంచి జీతం అందించబోతున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు. సపోర్ట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగులకు ప్రతినెల రూ.10 వేల నుంచి జీతం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించిన ఎంపిక వివరాల్లోకి వెళితే.. ముందుగా రాత పరీక్ష నిర్వహించి ఇందులో వచ్చిన మెరిట్ ని ఆధారంగా తీసుకొని ఎంపిక చేయనున్నారు.