Telangana latest Political Survey: తెలంగాణలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. 4 స్థానాల్లో BRSదే విజయం..!

Telangana latest Political Survey: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి యేడాది పూర్తైయింది. ఈ వన్ ఇయర్ లో విజయాల కంటే వివాదాలే ఎక్కవున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామిల్లో కేవలం మహిళలకు ఉచిత బస్సు పథకం మినహా పెద్దగా ప్రజలకు ఉపయోగపడిన పథకాలేమి లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సర్వే..ఇపుడు అధికార కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టిస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 19, 2025, 10:47 AM IST
Telangana latest Political Survey: తెలంగాణలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. 4 స్థానాల్లో BRSదే  విజయం..!

Telangana latest Political Survey: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న  పది మంది ఎమ్మెల్యేల  నియోజక వర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే వచ్చే పలితాలు ఆసక్తి  రేపుతున్నాయి.ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని సీరియస్‌గా తీసుకున్న BRS ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఒక వేళ సుప్రీం కోర్టులో ఆ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలితే ఉఎ ఎన్నిక అనివార్యం కానుంది. అదే జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న విషయంపై పలు సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నాయి.

ఇందులో భాగంగా  సీ-ప్యాక్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. BRS ప్రాతినిధ్యం వహిస్తున్న  ఆ పది స్థానాల్లో  గులాబీ పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి చెరో 4 స్థానాలు దక్కుతాయని సీ-ప్యాక్ సర్వేలో వెల్లడైంది. అయితే.. మిగతా 2 స్థానాల్లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందంటోంది.  మొత్తంగా ఎమ్మెల్యేల అనర్హత అంశం స్పీకర్ పరిధిలోకి వస్తుంది. దీనిపై  సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందా అనేది డౌటే. ఒక వేళ చేసుకుంటే.. మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతోంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

గతంలో బీఆర్ఎస్.. వేరే పార్టీల్లో 2/3 వంతు మందిని తన పార్టీలో విలీనం చేసుకోవడం వల్ల వాళ్ల పై అనర్హత వేటు పడలేదు. కానీ రేవంత్ రెడ్డి..బీఆర్ఎస్ పార్టీని చీల్చాలని చూసినా.. ప్రజా ప్రతినిధులు పెద్దగా ఇంట్రస్ట్ చూపెట్టలేదు. కేవలం పది మంది శాసనసభ్యులు మాత్రమే పార్టీ మారారు. మొత్తంగా సుప్రీంకోర్టు పార్టీ మారిన ఈ పది మంది పై వేటు వేస్తే మాత్రం.. కాంగ్రెస్ పార్టీ కనీసం 8 సీట్లలో అయినా గెలవాలి. లేకపోతే.. భవిష్యత్తులో ఆ పార్టీ వైపు వెళ్లాలనుకునే వారికి వేరే పార్టీలు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయం. ఒకవేళ అది జరిగితే.. తెలంగాణలో రేవంత్ సర్కారుకు పరిపాలన నల్లేరుపై నడక  కాదనేది తెలుస్తోంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News