Game Changer 1st Day Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ శుక్రవారం విడుదైలన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది.
‘గేమ్ చేంజర్’ మూవీలో రామ్ చరణ్ తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో ఒదిగిపోయారు. ఒక పాత్రలో స్లైలిస్ లుక్ లో కనిపిస్తే.. మరో పాత్రలో గ్రామీణ యువకుడి పాత్రలో ఒదిగాపోయారు. తాజాగా ఈ సినిమా తొలి రోజు ఓ రేంజ్ లో ఇరగదీసింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో పండగ సీజన్ ను స్టార్ట్ చేసింది.
గేమ్ చేంజర్’ మూవీ ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ‘గేమ్ చేంజర్’ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను శంకర్ దర్శకత్వం వహించారు.
‘గేమ్ చేంజర్’ మూవీ తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే రాబట్టింది. అటు తమిళం, హిందీలో కూడా పర్వాలేదనిపించే రీతిలో వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. యూఎస్ లో బుకింగ్స్ కొంచెం డల్ గా ఉన్నా.. ఓవరాల్ గా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో మాస్ బీ,సీ సెంటర్స్ లలో ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర అధికారికంగా ప్రకటించింది.
‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘గేమ్ చేంజర్’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి తండ్రి కొడులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటించారు.
ఇక రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ తెలుగులో రాష్ట్రాల్లో రూ. 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 221 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరి తొలిరోజే.. రూ. 186 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరి సంక్రాంతి సీజన్ లో మిగతా సినిమాల నుంచి పోటీ తట్టుకొని ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.