Vivo X200 Series: ఫోన్‌ అంటే ఇది సామీ.. పిచ్చెక్కించే ఫీచర్స్‌తో వీవో కొత్త సిరీస్‌.. డిజైన్‌ వేరే లెవల్!

Vivo X200 Series Launch Date: వీవో తమ కస్టమర్స్‌కి త్వరలోనే గుడ్‌న్యూస్‌ తెలపబోతున్నారు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో మొబైల్‌ సిరీస్‌ విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 

Vivo X200 Series Launch Date In India: ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని మొబైల్‌ కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అయితే వీవో నుంచి కూడా అతి శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ విడుదలకు ముందే లీక్ అయ్యాయి.
 

1 /5

ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్ప్లే సైజ్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.4-అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన కలర్‌ ఆప్షన్స్‌ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. అయితే ఈ మొబైల్ సిరీస్‌ను మొదట చైనాలో విడుదల చేసి.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానున్నారు.     

2 /5

ఈ Vivo X200 సిరీస్‌లో మొత్తం రెండు మోడల్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. ఇందులో మొదటి మోడల్‌ Vivo X200 స్మార్ట్‌ఫోన్‌, రెండవది Vivo X200 Pro మొబైల్‌తో అందుబాటులోకి రానున్నాయి.     

3 /5

వీవో మొట్ట మొదటి సారిగా మైక్రో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఇది ఇది ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. అలాగే కర్వుడ్‌ డిస్ల్పే సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇక ఫ్రంట్‌ భాగంగాలోని డిజైన్‌ పూర్తిగా Xiaomi 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను పోలి ఉంటుంది.     

4 /5

ఇటీవలే Vivo X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిజైన్ కూడా లీకైంది. దీని ఫ్రంట్ డిజైన్‌ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీవో గతంలో లాంచ్‌ చేసిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌ డిజైన్స్‌ పోలి ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్‌ డిజైన్‌ పరంగా ఫ్రంట్‌ భాగంలో మైక్రో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.  

5 /5

ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌లో భాగంగా వీవో నుంచి Vivo X200 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రపంచ మార్కెట్‌లో అతి త్వరతోనే విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ నవంబర్‌ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.