Hema Rave Party Case Update: ప్రముఖ నటి హేమా.. గత ఏడాది మే నెలలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరగగా అందులో పాల్గొనింది. అక్కడ మద్యం సేవిస్తున్నట్లు డ్రగ్ తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం లభించడంతో వెంటనే నిర్వహించిన పోలీసులు దాదాపు 87 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో వారికి రక్త పరీక్ష నిర్వహించగా.. అందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.
అలాంటి వారిలో నటి హేమా కూడా ఒకరు. ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తమ ఛార్జ్ సీటులో తెలియజేశారు. ఆమె మాత్రం వాటిని కొట్టి పారేసింది. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కచ్చితంగా తాను నిజాయితీతో బయటకి వస్తానని కూడా తెలిపింది. ఇకపోతే హేమాకు పలుమార్లు పోలీసులు నోటీసులు పంపినా.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఇక పది రోజుల పాటు జైల్లో ఉన్న ఈమె ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చింది.
ఇకపోతే కర్ణాటక హైకోర్టులో విచారణ జరపాల్సి ఉండగా.. తాజాగా ఇప్పుడు హైకోర్టు దీనిపై స్టే విధించింది.అసలు విషయంలోకి వెళితే, హేమాపై మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి నమోదైన కేసులో కర్ణాటక హైకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్లను తాత్కాలికంగా నిలిపివేసింది.
న్యాయమూర్తి హేమంత చందన గౌడ.. హేమా దాఖలు చేసిన పిటీషన్ ను పరిశీలించి ఎన్డీసీఎస్ చట్టం 1985 కింద సెక్షన్ 27 బి కి సంబంధించిన ఆరోపణలపై తాత్కాలిక స్టే ఆర్డర్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు నాలుగు వారాల పాటు అమలులో ఉంటాయని కూడా కోర్టు తెలిపింది.
ఇదిలా ఉండగా హేమా తరఫు న్యాయవాది వాదనల ప్రకారం ఈ కేసులో ఆరోపణలు కేవలం సహ నేరస్తుని ఒప్పంద ప్రకటన ఆధారంగా మాత్రమే ఉన్నాయని, మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఎటువంటి ప్రత్యక్ష ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇకపోతే తాత్కాలికంగా స్టే ఆర్డర్ ను ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. దీంతో నాలుగు వారాలపాటు హేమాకు ఊరట లభించింది అని చెప్పవచ్చు.
Also Read: Sankranti: సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల భారీ షాక్.. కోడి పందాలకు బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.