Indian Top Directors: పుష్ప 2తో వెయ్యి కోట్ల సింహాసనంపై సుకుమార్ .. సుక్కు కంటే ముందు వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టిన దర్శకులు వీళ్లే..

Indian Top Directors sukumar: ఫుష్ప సిరీస్ సక్సెస్ తో దర్శకుడుగా సుకుమార్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరెకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులకు పాతర వేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టి సంచలనం రేపింది. ఈయన కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుల విషయానికొస్తే..

1 /9

రాజమౌళి  తెరకెక్కిన ‘బాహుబలి 2’తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల మార్క్ అనే మైలు స్టోన్ ను  అందుకున్నాడు. ఆ తర్వాత  జక్కన్న రూట్ లో  పలువురు డైరెక్టర్స్  ఈ ఫీట్ ను అందుకున్నారు. ఈ యేడాది కల్కితో నాగ్ అశ్విన్.. తాజాగా పుష్ప 2తో సుకుమార్ రూ. వెయ్యి కోట్ల రాబట్టిన దర్శకులు లిస్టులో చేసారు.

2 /9

సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా 8 రోజుల్లో దాదాపు రూ. 1100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించింది. ‘పుష్ప 2’ తో  సుకుమార్ పేరు టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా మారింది.

3 /9

నాగ్ అశ్విన్.. నాగ్ అశ్విన్ .. ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన ‘కల్కి 2898 AD’ చిత్రంతో తొలిసారి ఫస్ట్ టైమ్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి  వరకు రూ. 1111 కోట్ల వరకు రాబట్టినట్టు బాక్సాఫీస్  ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

4 /9

రాజమౌళి.. రాజమౌళి..బాహుబలి 2 మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించారు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1810 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

5 /9

బాహుబలి 2 తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ప్రపంచ వ్యాప్తంగా  బాక్సాఫీస్ దగ్గర రూ. 1310 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

6 /9

ప్రశాంత్ నీల్.. యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెయ్యి కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1215 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

7 /9

నితీష్ తివారీ.. దంగల్ మూవీతో  దర్శకుడు నితీష్ తివారీ భారతీయ బాక్సాఫీస్ తో పాటు చైనా బాక్సాఫీస్ దగ్గర కలిపి రూ. 1958 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది

8 /9

అట్లీ.. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ చిత్రంతో ఫస్ట్ టైమ్  వెయ్యి కోట్ల క్లబ్బులో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ.1160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

9 /9

సిద్ధార్థ్ ఆనంద్.. షారుఖ్ హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ మూవీతో ఫస్ట్ టైమ్ రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు సిద్ధార్ధ్ ఆనంద్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  రూ. 1055 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.