Keerthy Suresh Marriage
తమిళ హీరో విజయ్, త్రిష.. మధ్య ఏదో నడుస్తోంది అని ఎన్నో రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో కనిపించారు. ఇక ఈ మధ్యనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికీ కూడా విజయ్ త్రిష తోనే కలిసి ఉన్నారు అనే వార్తలు ప్రచారం అయ్యే జోరు తగ్గడం లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి సురేష్ వివాహం అటెండ్ అయ్యి.. ఈ రూమర్స్ కి మరింత బలం చేకూర్చారు
తమిళ సినీ నటుడు దళపతి విజయ్, నటి త్రిష క్రిష్ణన్ మధ్య డేటింగ్ రూమర్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ ఎన్నో సినిమాలలో కలిసి నటించగా.. వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోందని ఎన్నో రోజుల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో..వీరు గోవాలో జరిగిన కీర్తి సురేష్-ఆంటోనీ తట్టిల్ వివాహ వేడుకకు కలిసి ప్రయాణించినట్లు ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. ఈ ఫొటోలతో వీరి సంబంధం గురించి సోషల్ మీడియాలో.. మళ్లీ చర్చ మొదలైంది.
విజయ్, త్రిష క్రిష్ణన్ ఒక ప్రైవేట్ ప్లైట్‌లో గోవాకు ప్రయాణించారు అనేది విశ్వసనీ వర్గాల సమాచారం. అంతేకా..విమానంలో వారితో పాటు మరికొందరు అతిథులు ఉన్నట్లు క్రూ లిస్ట్ ద్వారా వెల్లడైంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ..త్రిష సాధారణ వైట్ టీ-షర్ట్ ధరించగా, విజయ్ బ్లూ స్ట్రైప్ షర్ట్‌తో చక్కగా కనిపించారు.
డిసెంబర్ 12న కీర్తి సురేష్ తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌ను గోవాలో వివాహమాడింది. ఈ వేడుకలో విజయ్, త్రిషతో పాటు మాళవిక మోహనన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఈ క్రమంలో విజయ్, త్రిష కి సంబంధించిన..ఫొటోలు బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. "వెడ్డింగ్‌లో పాల్గొనడం తప్పేంటి?" అని కొందరు విజయ్‌ను సమర్థిస్తే, మరికొందరు అసలు వీరిద్దరేంటి మరి ఇలా తయారవుతున్నారు అని.. విమర్శలు చేస్తున్నారు.
కాగా త్రిష, విజయ్ గురించి రూమర్లు ఇటీవల మరి ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా.. ఇలాంటి వార్తలు రావడం.. కొంతమందిని ఆశ్చర్యపరస్తోంది. అయితే ఈ జంట తమ వ్యక్తిగత జీవితంపై.. ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.